కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిచ్చగాడు సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆ యాంకర్ తో ప్రేమలో పడి ఫాతిమా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఇక కొద్ది రోజుల క్రితమే తన పెద్ద కుమార్తె ఆ****త్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
తన కూతురు మరణాన్ని విజయ్, తన భార్య ఫాతిమా తట్టుకోలేకపోతున్నారు. ఇక రీసెంట్ గా తన భార్య ఫాతిమా తన కూతురి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ ట్వీట్ లో భాగంగా ఫాతిమా మాట్లాడుతూ ‘నా కూతురు అతి చిన్న వయసులోనే మరణించింది. నా కూతురు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుందని తెలిసి ఉంటే నా కూతురుని మరింత దగ్గరగా నేను ఉంచుకునే దాన్ని. కనీసం బయట ప్రపంచానికి కూడా చూపించకుండా సూర్యచంద్రులకు కూడా కనిపించకుండా కాపాడుకునేదాన్ని.
Advertisement
Advertisement
ఇక నా కూతురు మా మధ్య లేకపోవడంతో తన ఆలోచనలతో ప్రతి క్షణం మరణిస్తున్నాం’ అని ఫాతిమా పోస్ట్ చేశారు. ‘నువ్వు లేకుండా ఈ లోకంలో మేము ఉండలేకపోతున్నాము… నీ చెల్లెలు నీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. తిరిగి మా వద్దకు వచ్చేయి మీరా’ అంటూ ఫాతిమా ఎమోషనల్ అయ్యారు. ఇక ఫాతిమా పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఫాతిమాను జాగ్రత్తగా చూసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- అమిత్ షాతో నారా లోకేష్ రహస్య మంతనాలు…బీజేపీలో టీడీపీ విలీనం కానుందా !?
- 3 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తూ ఉంటాడు – జగన్
- Regina Cassandra: పెళ్లి కాకుండా గర్భవతి అయిన తెలుగు హీరోయిన్..?ఆ హీరోనే తండ్రి !