Home » 3 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తూ ఉంటాడు – జగన్

3 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తూ ఉంటాడు – జగన్

by Bunty
Ad

 

 

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మూడేళ్లకి ఒకసారి పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తూ ఉంటాడంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ సామర్లకోటలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పేదలకు ఇండ్ల పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాదులో ఉన్నప్పటికీ… ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుంటారని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

cm jagan mohan reddy comments on pawan kalyan marriages

cm jagan mohan reddy comments on pawan kalyan marriages

ఒకసారి లోకల్, మరొకసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ? అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆడవాళ్లు, పెళ్లిళ్ల వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజకీయ నాయకులమైన మనమే భార్యలను ఇలా మారిస్తే ఎలా అని నిలదీశారు. వాడుకోవడం మరియు వదిలేయడం ఏంటని ప్రశ్నించారు సీఎం జగన్. అచ్చం అలాగే తన నియోజకవర్గాలను కూడా వదిలేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Advertisement

Advertisement

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయి.. ఇళ్లు కాదు.. ఊళ్తు వస్తున్నాయి అని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు…మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading