ఎస్.ఎస్.రాజమౌళి ఈ వ్యక్తి పదిహేనేళ్ల కిందట ఒక సాధారణ తెలుగు సినిమా దర్శకుడు. కానీ ఇప్పుడు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా, జక్కన్నగా సినిమాలను సంవత్సరాల తరబడి చెక్కే శిల్పిగా పేరున్న ఈ డైరెక్టర్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో ముచ్చుకు కొన్ని కర్ణాటకలో రాయ్‌చూర్ లో పుట్టిన ఈ దర్శక దిగ్గజం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కొడుకుగా మనందరికీ పరిచయమే.
అయితే ఆయన దర్శకుడిగా మారడానికి తాను పడ్డ కష్టం మామూలు కాదు. లెజెండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాజమౌళి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకెదిగాడు. శాంతి నివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత రాఘవేంద్ర రావు ప్రోత్సాహంతో స్టూడెంట్ నెంబర్ 1 తో డైరెక్టర్ అయ్యాడు. తొలి అడిగే విజయానికి నాందిగా, తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా పునాది వేసుకున్నాడు. ఇక ఆ తరువాత ఒక్క పరాజయం కూాడా లేకుండా RRR వరకు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు రాజమౌళి.
Advertisement
Advertisement
దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన బాహుబలి. కథ ఏదైనా, హీరో ఎవరైనా సరే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. 24 ఫ్రేమ్స్ ఉన్న సినిమా విభాగాల్లో తన మార్క్ ను చూపించే ఛత్రపతి. సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి. ఇండస్ట్రీలో ఉండే 24 మీద పట్టున్న విక్రమార్కుడు రాజమౌళి. ఈగ నీ హీరోని చేసిన ఘనత ఆయనదే. చేసింది కొన్ని సినిమాలే అయినా వందల సినిమాలు చేసినంత పేరు వచ్చింది. నేడు రాజమౌళి బర్త్ డే. ఆయన ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
50 ఏళ్ల రజిత పెళ్లి చేసుకోకపోవడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా ?
అల్లు అర్జున్ భార్య పట్ల అలా వ్యవహరిస్తున్నాడా..? ఆ విషయంలో భార్య కోరిక తీర్చలేక..!