ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రజిత గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండవచ్చు. హీరోయిన్ నటించిన ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సుమారు 300కి పైగా సినిమాల్లో నటించిన యాక్టర్ రజిత చలాకి పాత్రల్లో నటిస్తోంది. కానీ అలాంటి ఆమె నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోలేదు. 50 ఏళ్ల వయసులో ఉన్న ఆమె ఇప్పటివరకు కూడా పెళ్లి చేసుకోలేదంటే అబ్బాయి దొరక్క కాదు, అసలు ఈమెకు పెళ్ళంటే ఇష్టం లేక వివాహం చేసుకోలేదట. మరి ఈమె ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కాకినాడలో పుట్టిన రజిత కెరియర్ మొదట్లో భోజ్పూరి, మలయాళ, ఒడిశా వంటి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా సెట్ అయిపోయింది. బ్రహ్మానందం, చంద్రమోహన్, గుండు హనుమంతరావు, లాంటి సీనియర్ యాక్టర్స్ సరసన భార్యగా నటించింది. ఇంత సక్సెస్ అయిన రజిత పెళ్లి ఎందుకు చేసుకోలేదని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే తనకు ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్లడమే ఇష్టమని.. అందుకే ఎప్పుడూ దేవుని పూజలలో భక్తిపారవశంలో మునిగిపోతుందట. పెళ్లి, భర్త, పిల్లలపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పడం గమనార్హం.
Advertisement
కానీ అసలు కారణం అది కాదండోయ్.. రజిత తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయారట. తన ఇద్దరు అక్క, చెల్లెలను కుటుంబాన్ని పోషించడానికి రజిత ఎంతో కష్టపడిందట. ఇక నటిగా మారి సక్సెస్ అయిన తర్వాత తన నుంచి వచ్చిన పూర్తి డబ్బు కూడా కుటుంబానికే పెట్టిందట. ఆ విధంగా వారి కుటుంబంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని అనేక ఇబ్బందులు పడి విడిపోయారట. దీనివల్లే ఆమెకు పెళ్లిపై ఆసక్తి లేదని.. పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడే కంటే మొత్తానికే పెళ్లి చేసుకోకపోవడం మంచిదనే ఆలోచనతో ఆమె వివాహానికి దూరంగా ఉందట నటి రజిత.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పెళ్లై కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడ్డ రాజమౌళి.. పిల్లలు వద్దనడానికి కారణం అదేనా ?
తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక దాగి ఉన్న రహస్యం గురించి మీకు తెలుసా ?