Home » SS Rajamouli Love Story: పెళ్లై కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడ్డ రాజమౌళి.. పిల్లలు వద్దనడానికి కారణం అదేనా ?

SS Rajamouli Love Story: పెళ్లై కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడ్డ రాజమౌళి.. పిల్లలు వద్దనడానికి కారణం అదేనా ?

by Anji
Published: Last Updated on
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే RRR  మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. RRR    సినిమాలోని నాటు నాటు సాంగ్ పాటకి ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా  చులకనగా చూసేవారు.  అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ ను మించి హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం రాజమౌళి అని చెప్పాలి. ఇక అలాంటి రాజమౌళి ఓ పెళ్లై కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ పిల్లలను మాత్రం కనలేదు. అంత డబ్బు.. ఆస్తి, పేరు ఉన్నప్పటికీ..  రాజమౌళి పిల్లలను అసలు ఎందుకు కనలేదు..? ఇవాళ  ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం.

Advertisement

 ఇవాళ రాజమౌళి 51వ పుట్టినరోజు. 1973లో కేవీ విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించాడు రాజమౌళి. తొలుత రాజమౌళి దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగాడు. శాంతి నివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించాడు రాజమౌళి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ప్రోత్సాహంతో స్టూడెంట్ నెంబర్ 1 మూవీకి దర్శకుడు అయ్యాడు. తొలి అడుగే విజయానికి నాందిగా.. ఇండస్ట్రీలో పునాది స్ట్రాంగ్ గా వేసుకున్నాడు. ఇక ఆ తరువాత వెంటనే అవకాశాలు రాలేదు. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడో దాదాపు అందరికీ తెలిసిందే. కానీ రాజమౌళి చిత్రాన్ని తొలుత బాలకృష్ణకి, ఆ తరువాత ప్రభాస్ కథ చెప్పగా.. అనివార్య కారణాలతో వాళ్లు సినిమా చేయలేకపోయారు. చివరగా ఎన్టీఆర్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 

Advertisement

తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి రచయిత మరియు దర్శకుడు. సంగీత దర్శకుడు కీరవాణి పెదనాన్న కొడుకు అంటే రాజమౌళికి అన్న అవుతాడు. రాజమౌళి చిన్నప్పుడు జులాయిగా తిరుగుతున్న సమయంలో వదిన శ్రీవల్లి చెప్పిన మాటలతో తను ఇండస్ట్రీలోకి వచ్చాడు. శాంతి నివాసం అనే సీరియల్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సమయంలో రమతో రాజమౌళి ప్రేమలో ఎలా పడ్డారో ఈ విషయం చాలా మందికి తెలియదు. రాజమౌళి ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు. రాజమౌళి పని చేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు కుటుంబమంతా కలిసి పని చేస్తుందనే విషయం తెలిసిందే. రాజమౌళి సోదరుడు కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తే.. ఆయన భార్య వల్లి ఆ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడు. రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుండగా.. కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఖర్చు పెరగకుండా తక్కువ ఖర్చులోనే క్వాలిటీ సినిమా ఎలా ఇవ్వాలనే బాధ్యతలు తీసుకుంటుంటాడు.

అలా కుటుంబం మొత్తం సినిమా రంగంలో సెట్ అయిపోయారు.  రాజమౌళి సినిమా తీసే క్రమంలో అంతా ఒకే దగ్గర పని చేయడంతో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుందని భావించవచ్చు. సెట్ లోకి వెళ్లితే.. రాజమౌళి ఎలాగో రాక్షసుడే. అలా రాజమౌళి రమతో ప్రేలో పి.. పిల్లలు కూడా కనలేదు. ఆయన గురించి తెలుసుకున్న నెటిజన్లు ఇది కదా లవ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేసే పనిలో ఉన్నారు. రాజమౌళి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని.. ముందు ముందు సినీ పరిశ్రమకు గొప్ప విజయాలను అందుకోవాలని మనం కోరుకుందాం. మనం న్యూస్ తరపున దర్శక ధీరుడు రాజమౌళికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 అల్లు శిరీష్ కి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లి చేసుకోవట్లేదా..?

అతనితో రిలేషన్షిప్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ?

Visitors Are Also Reading