తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించినది అందాల భామ త్రిష. మళయాళంలోకి మాత్రం చాలా ఆలస్యంగా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తొలిసారిగా మళయాళంలో చేసిన సినిమా ‘హేజూడ్ ‘2018లో ఫిబ్రవరి 02న విడుదల అయింది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష సరసన ప్రముఖ మళయాళ నటుడు నివిన్ పాల్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది. సినిమా ప్రారంభం అయ్యే కొచ్చిలోనే అయినప్పటికీ.. తరువాత కథ గోవాకు మారుతుంది. హీరో జూడ్ కొచ్చి నుంచి తన తండ్రితో కలిసి అనుకోకుండా వచ్చిన ఓ ఆస్తిని పొందడానికి గోవాకు వెళ్లడం, అక్కడ హీరోయిన్ క్రిస్టల్ తో పరిచయం కావడం, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందన్నదే ఈ చిత్రం కథ.
Advertisement
Advertisement
ఇక ఇందులో నివిన్ పౌల్ బుద్ధిమాద్యం ఉన్న యువకునిగా నటించాడు. మేథస్సులో అతనికి తిరుగు లేకపోయినా.. వ్యవహారిక విషయాల్లో తన వయస్సుకు తగ్గ పరిపక్వత లేని యువకుని పాత్రను పోషించాడు. ఆ కారణంగా అతనికి సమాజం నుంచి తోటి వ్యక్తుల నుండి రకరకాల సమస్యలు ఎదురవ్వడంతో పాటు.. అతను ఈ సమాజం నుంచి తోటి వ్యక్తుల నుంచి సమస్యలను ఏవిధంగా అధిగమిస్తూ ముందుకు సాగాడు అనేదే ఈచిత్రం. సిద్ధిక్, నీనా కురూప్, విజయ్ మీనన్, అపూర్వబోస్, అజూవర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకు నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చడం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆహాలో జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.