టాలీవుడ్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె కేవలం టాలీవుడ్ మాత్రమే దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. కేవలం సౌందర్య పోస్టర్ చూసి సినిమాకు వచ్చే వాళ్లు అప్పట్లో చాలా మందే ఉండేవారు. ఈ అందాల తార సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె అభిమానులు టీవీలలో సౌందర్య సినిమాలు వస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు.
Advertisement
దాదాపు 100 సినిమాలకు పైగా నటించినప్పటికీ ఎక్కడ కూడా గ్లామర్ డోస్ మాత్రం పెంచలేదు. అయితే ఆ తర్వాత కాలంలో కొంత మంది హీరోయిన్లు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు కాస్త గ్లామర్ లుక్ లో కనిపించినప్పటికీ తన సహజ యాక్టింగ్ తోనే ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల విషయంలో ఏదో ఒక రూమర్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. అయితే సౌందర్య ఆ ప్రాపర్టీని తన పేరు మీద రాయించుకున్నప్పటికీ విమాన ప్రమాదంలో సౌందర్య చనిపోయాక ఆమె పేరు మీద ఉండే చాలా ఆస్తులు అప్పట్లో ఉండే ఓ రాజకీయ నాయకుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన పేరు మీద మార్చుకున్నారట.
Advertisement
ఇక ఇప్పటి మార్కెట్ ప్రకారం.. అది 200 కోట్ల ఆస్తి అంటే ఆ రాజకీయ నాయకుడు సౌందర్య పేరు మీద ఉన్న రూ.200 కోట్ల ఆస్తిని రాయించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనే సంగతి మాత్రం తెలియదు. కానీ సౌందర్య చనిపోయాక ఈ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక సౌందర్య చనిపోయాక ఆమె సంపాదించిన ఎన్నో కోట్ల ఆస్తులు అన్ని తన భర్తకే వెళ్లాయని, తన కుటుంబ సభ్యులకి కూడా ఎవరికి సౌందర్య ఆస్తిపాస్తులు చెందలేదని ఆమె చనిపోయాక కుటుంబ సభ్యులు మీడియా ముందు కూడా వెల్లడించడం గమనార్హం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
శోభన్ బాబును ఆ విషయంలో జయలలిత తల్లి అంతలా అవమానించిందా..?