Home » Dussehra 2023: విజయదశమి నాడు పాలపిట్టని చూస్తే.. ఏం అవుతుంది..?

Dussehra 2023: విజయదశమి నాడు పాలపిట్టని చూస్తే.. ఏం అవుతుంది..?

by Sravya
Ad

దసరా పండుగ నాడు పాలపిట్టని చూస్తే మంచిదని అంటూ ఉంటారు. మరి దసరా రోజు పాలపిట్టని చూస్తే ఏం అవుతుంది..? అసలు ప్రజలు ఆరోజు పాలపిట్టని చూడడానికి ఎందుకు వెతుకుతారు వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. విజయదశమి పండుగ ప్రతి ఏడాది కూడా శుక్లపక్షంలో పదవ రోజున వస్తుంది. రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించినందుకు ఈ పండుగని మనం అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు చెడుపై మంచి కి చిహ్నం గా పరిగణించబడుతుంది. విజయదశమి నాడు రావణ దహనం జరుగుతుంది.

Advertisement

నవరాత్రి ఉత్సవాలు కూడా ఈరోజుతో ముగిసిపోతాయి. దుర్గాదేవి మహిషాసురుడిని చంపి ప్రపంచాన్నే రక్షించింది. దసరా రోజున పాలపిట్టని చూడడం కూడా ఎంతో ముఖ్యమైనది పాలపిట్ట ప్రాముఖ్యతని గ్రంథాలలో కూడా వివరించారు. పాలపిట్ట శివుని ప్రతినిధిగా పరిగణించబడింది. రాముడు రావణుడిని సంహరించే సమయంలో పాలపిట్ట ని దర్శనం చేసుకున్నారట. ఆ తర్వాతే దుష్టుడుని జయించాడని పురాణాలలో చెప్పారు. విజయదశమి నాడు పాలపిట్టని చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది.

Advertisement

అనుకున్న పనులు పూర్తవుతాయి. నీలకంఠ పక్షి అంటే పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చిన శివుడు. రాముడు లక్ష్మణుడితో కలిసి శివుడిని పూజించి పాపం నుండి విముక్తిని పొందడానికి శివుడిని పిలిచారని కథ కూడా ఉంది. అప్పుడు శివుడు నీలకంఠ పక్షి అంటే పాలపిట్ట రూపంలో ఈ లోకానికి వచ్చారు. అందుకే పాలపిట్ట దర్శనం కి అంత ప్రాధాన్యత ఉంది. విజయదశమి నాడు పాలపిట్టని చూసి ”కృత్వా నీరాజనం రాజా బలవృద్ధయం యత బలం” అనే మంత్రాన్ని జపించాలట.

Also read:

Visitors Are Also Reading