ముఖేష్ అంబానీ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఆయన వ్యాపారాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ బిజినెస్ మ్యాన్ ఎదిగాడు అంబానీ. ముఖ్యంగా ప్రస్తుతం 5G మొబైల్ ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే అందుబాటులోకి రాని చోట అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. అయితే ముఖేష్ అంబానీ కోడలు రాధిక మర్చంట్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె వివరాలు మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Advertisement
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కొద్ది నెలల క్రితం రాధిక మర్చంట్ తో రాజస్థాన్ లోని శ్రీనాథ్ జీ ఆలయంలో కుటుంబ సభ్యులు, కొంత మంది బంధువుల సమక్షంలో డిసెంబర్ 29న నిశ్చితార్థం జరిగింది. 2024 జులై 10, 11, 12 తేదీల్లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరుగబోతున్నట్టు సమాచారం. అనంత్, రాధికా చిన్ననాటి స్నేహితులు. ఈమె చాలా సంవత్సరాలుగా అంబానీ కుటుంబంతో సన్నిహితంగా ఉంటుంది ఈమె ప్రముఖ వ్యాపార దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె. రాధిక మర్చంట్ కి ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 60వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో దిగిన ఫోటోలు చాలా వరకు ఈమె ఖాతాలో మనం చూడవచ్చు.
Advertisement
న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన రాధికా మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. న్యూయార్క్ నుంచి తిరిగొచ్చిన తరువాత ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్ లలో ఇంటర్న్ షిప్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్ గా కూడా పని చేసింది. ఆ తరువాత కుటుంబం వ్యాపారమైన ఎన్ కోర్ హెల్త్ కేర్ బోర్డు డైరెక్టర్ గా పని చేసింది రాధికా మర్చంట్. విలాసవంతమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఖరీదైన దుస్తులు, వస్తువులు వినియోగించడానికి చాలా ఆసక్తి చూపిస్తుంది. ఈ మె సంపద విలువ రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. రాధిక మర్చంట్ తండ్రి వీరేన్ మర్చంట్ నికర విలువ దాదాపు రూ.755 కోట్లు రాధికకు చదవడం, ప్రయాణం, ట్రెక్కింగ్ అండ్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమట.