ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన రోజా ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదిగింది. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగుతోంది. అలాంటి మంత్రి రోజాపై ఈ మధ్యకాలంలో టిడిపి నాయకుడు సత్యనారాయణ అనుచితమైన కామెంట్లు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదే తరుణంలో రోజా భర్త సెల్వమణి కూడా సత్యనారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Advertisement
ఈ విధంగా గత వారం రోజుల నుంచి రోజా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. ఇదే తరుణంలో రోజాకు సంబంధించి లవ్ స్టోరీ గురించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే రోజాది ప్రేమ వివాహం అని చాలామందికి తెలియదు.. అయితే సెల్వమణి రోజాని చాలా కాలం నుంచి ఇష్టపడ్డారట. అలా ఆమె షూటింగ్ చేస్తున్న స్పాట్ లోకి వెళ్లి ఆమెను చూడడం వంటివి చేసేవారట. ఆ విధంగా చివరికి సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమా షూటింగులో రోజా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్లి రోజాకు ఐ లవ్ యు అని చెప్పారట.
Advertisement
అంతే కాదు నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంటూ డైరెక్ట్ గా రోజాతో అన్నారట. అప్పుడు రోజా షాక్ అయిపోయి ఆలోచనలో పడిందట. 1992 సమయంలో ఈ విధంగా సెల్వమణి ప్రపోజ్ చేసిన తర్వాత లవ్ లో పడ్డ రోజా పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ 2002లో చేసుకుంది. అంటే పదేళ్ల పాటు వీరు ప్రేమలో మునిగిపోయారు. పదేళ్ల తరువాత రోజా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత వీరిద్దరికీ ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పుట్టారు. ప్రస్తుతం సెల్వమణి తమిళ దర్శకుల సంఘంలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. రోజా ఏపీ వైసీపీలో క్యాబినెట్ మినిస్టర్ గా కొనసాగుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పది రూపాయలకే ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఈమె గురించి తెలిస్తే సెల్యూట్ చెయ్యకుండా ఉండలేరు!