ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఇక అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాలు సైతం ఎదురుచూస్తున్నాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రతి ఒకరు చాలా ఆసక్తిగా చూస్తారు. అయితే ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య గల వివాదాల కారణంగా… ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.
Advertisement
Advertisement
ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జాకా అష్రాఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని పేర్కొన్న అష్రాఫ్… ఈ రెండు జట్ల మధ్య ఈ టెస్ట్ సిరీస్ జరిగితే యాషెష్ సిరీస్ కూడా పనికి రాదని తెలిపాడు. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ కు గాంధీ- జిన్నా అనే పేరు పెట్టాలని కూడా బీసీసీఐ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
- “చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం” ?
- రజని తన కోసం సొంతంగా రాసుకున్న కథతో మోహన్ బాబు నటించిన ఫ్లాప్ సినిమా అదేనా ? :
- World Cup 2023 : క్రికెట్ ఫ్యాన్స్ కి బిజెపి బంపర్ ఆఫర్ ఉచితంగా టికెట్స్…!