వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మరో మూడు రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది. దీనికోసం బీసీసీఐ మరియు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ టోర్నమెంట్ ఆడేందుకు ఇప్పటికే 9 దేశాలు ఇండియాకు వచ్చేసాయి.
ఈ నేపథ్యంలోనే వామప్ మ్యాచ్ లు కూడా మొదలుపెట్టాయి వరల్డ్ కప్ జట్లు. ఇక మొట్టమొదటన అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభం మ్యాచ్ జరగనుంది. అటు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కీలక పోరు జరగనుంది.
Advertisement
Advertisement
ఈ నేపథ్యంలో మన భారత దేశంలోని ముస్లింలపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ముస్తాక్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలోని హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ నగరాలలో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారని… ఈ రెండు నగరాలలో ఉన్న ముస్లింలు ఇండియా కంటే పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ముస్తాక్ అహ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే గతంలో రానా నవీదులు హసన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
- చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలి : వైసీపీ ఎమ్మెల్యే
- పెళ్లయిన మహిళలు ఈ తప్పులు చేస్తే.. భర్త జీవితం నాశనం అవుతుందట!
- వరల్డ్ కప్లో నో ఛాన్స్….చాహల్ షాకింగ్ కామెంట్స్.. చాలా బాధగా ఉందంటూ !