వన్డే వరల్డ్ కప్ లో తన పేరు లేకపోవడంపై తాజాగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ యుజెంద్ర చాహల్ స్పందించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని తప్పు పట్టకుండా… సానుకూలంగా స్పందించాడు చాహల్. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటు మన ఇండియాలో జరగనుంది. దీనికోసం ఇప్పటికే 9 దేశాలు ఇండియాకు తరలివచ్చాయి.
అటు టీమిండియా జట్టును కూడా ఇప్పటికే బీసీసీఐ మార్పులు చేర్పులు చేసి ప్రకటించేసింది. అక్షర పటేల్ గాయం తీవ్రం కావడంతో… అతని స్థానంలో అశ్విన్ ను తీసుకుంది. అయితే అక్షర పటేల్ స్థానంలో ఆయన చాహాల్ ను తుది జట్టులో తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఈ చహల్ కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురయింది.
Advertisement
Advertisement
ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ నిర్ణయంపై స్పందించాడు చాహల్. వరల్డ్ కప్ ఆడేందుకు కేవలం 15 మంది సభ్యులు మాత్రమే అవసరం… కానీ 18 మందిని జట్టులోకి తీసుకోరు కదా..! అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చాహల్. నన్ను జట్టులోకి తీసుకోకపోవడం చాలా బాధించింది… కానీ నాకంటే బెస్ట్ 15 మంది అక్కడ ఉన్నారు… అందుకే కొన్ని సమయాలలో అన్ని భరించాల్సిందే అని చాహాల్ వెల్లడించాడు. ఇందులో ఎవరిని కూడా తప్పుపట్టాల్సిన పని లేదని చెప్పకనే చెప్పాడు.
ఇవి కూడా చదవండి
- Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?
- పెళ్లి చేసుకోబోతున్న స్టార్ సింగర్ మంగ్లీ.. అబ్బాయి ఎవరో తెలిసా ?
- Naa Saamiranga Movie : నా సామిరంగా సినిమా కోసం ఇద్దరు భామలు..!