Home » సిరికి క‌రోనా.. ఇక ష‌న్ను ప‌రిస్థితి ఏమిటో..?

సిరికి క‌రోనా.. ఇక ష‌న్ను ప‌రిస్థితి ఏమిటో..?

by Anji
Ad

క‌రోనా రోజు రోజుకు విప‌రీతంగా పెరుగుతుంది. వారు వీరు అని తేడా లేకుండా అంద‌రినీ ట‌చ్ చేస్తూనే ఉంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడ కొంద‌రూ క‌రోనా బారిన ప‌డ‌డంతో అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి ఐసోలేష‌న్‌లో చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ బ్యూటి సిరికి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు ఆమె వివ‌రించింది.

siri

Advertisement

Advertisement

బిగ్ బాస్ సీజ‌న్ 5లో టాప్ 5 కంటెస్టెంట్ గా బ‌య‌టికి వ‌చ్చిన సిరి హ‌న్మంత్‌.. ష‌న్నుతో రిలేష‌న్‌లో ఉందనే రూమ‌ర్స్‌తోనే ఎక్కువ పాపుల‌ర్ అయింది. వారిద్ద‌రూ తాము స్నేహితులం అని చెప్పుకుంటున్నా.. వారి మ‌ధ్య ఏదో ఉంద‌నే వార్త‌లు మాత్రం ఆగ‌డం లేదు. ఇక సిరి క‌నోనా బారిన ప‌డ‌టంతో ష‌న్ను ప‌రిస్థితి ఏమిటి..? అని అభిమానులు ఆందోళ‌న ప‌డుతున్నారు. ఇటీవ‌ల సిరినీ, ష‌ణ్ముఖ్ క‌లిసాడా..? లేదా అనేది మాత్రం తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌వేళ క‌లిస్తే ష‌న్నుకు కూడా క‌రోనా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ష‌న్ను కామెంట్లు పెడుతున్నారు.

ఇక‌పోతే సిరి వ‌ల్ల‌నే దీప్తి, ష‌న్ను విడిపోయారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వారి బ్రేక‌పున‌కు కార‌ణం నేను కాద‌ని.. తేల్చి చెప్పింది సిరి. మ‌రొక ప‌క్క సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీ‌హ‌న్ కూడా సిరిని దూరం పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా బిగ్ బాస్ మూలంగా రెండు జంట‌లు విడిపోయే ప‌రిస్థితి వ‌చ్చిదంటూ.. నెటిజ‌న్లు వాపోతున్నారు.

Visitors Are Also Reading