టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త కల్యాణ్ దేవ్ మధ్య సరైన సంబంధం లేదు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దానికి కారణం శ్రీజ కల్యాణ్ దేవ్ ఫోటోలను గత ఏడాది కాలంగా అసలు షేర్ చేయకపోవడమే. అంతే కాకుండా ఇటీవల కూతురు పుట్టిన రోజుకు కూడా కల్యాణ్ మాత్రమే కేక్ కట్ చేయించారు. దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేయగా అందులో శ్రీజ కనిపించలేదు.
ఇక ఇటీవల శ్రీజ పుట్టిన రోజు సంధర్భంగా కల్యాణ్ దేవ్ ఆమె ఫోటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా ఆమె పట్టించుకోనట్లే కనిపించింది. మరోవైపు శ్రీజ కల్యాణ్ దేవ్ సినిమాలకు సంబంధించిన ఫోటోలను కూడా గత కొద్ది రోజులుగా షేర్ చేయడంలేదు. కల్యాణ్ దేవ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను కూడా ఆమె పట్టించుకోవడం లేదు. మరోవైపు రీసెంట్ గా కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా విడుదలైంది.
Advertisement
Advertisement
ఈ సినిమాకు అసలు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ అందలేదు. అంతే కాకుండా సూపర్ మచ్చితో పాటూ సంక్రాంతి బరిలో నిలిచిన హీరో, రౌడీ బాయ్స్ సినిమాలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ ఇచ్చారు. కానీ సూపర్ మచ్చికి మాత్రం ఏ మెగా హీరో కూడా సపోర్ట్ ఇవ్వలేదు. దాంతో మెగా ఫ్యామిలీ కల్యాణ్ దేవ్ ను పక్కన పెట్టిందా అన్న అనుమానాలు కూడా జోరుగా వినిపించాయి.
ఇదిలా ఉండగా ఇద్దరూ గతేడాది ఆగస్టు నుండి కలిసి ఉండటం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా ఇప్పుడు శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ నుండి శ్రీజ కల్యాణ్ అనే పేరులోని కల్యాణ్ అనే పేరును తొలగించి కొనిదెల అని యాడ్ చేసుకుంది. ఇక ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
also read : బాలనటుడు అంటే బాగా ఇష్టం అంటూ.. అన్స్టాపబుల్లో బయట పెట్టిన బాలయ్య