Home » బాల‌న‌టుడు అంటే బాగా ఇష్టం అంటూ.. అన్‌స్టాపబుల్‌లో బయట పెట్టిన బాలయ్య

బాల‌న‌టుడు అంటే బాగా ఇష్టం అంటూ.. అన్‌స్టాపబుల్‌లో బయట పెట్టిన బాలయ్య

by Anji
Ad

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన అన్‌స్టాప‌బుల్ ఎన్‌బీకే ఎపిసోడ్స్ అన్నిటికంటే ఎక్కువ‌గా ఎపిసోడ్‌ నిడివి ఉన్న‌ది. నందమూరి బాల‌కృష్ణ నిర్వ‌హిస్తున్న అన్‌స్టాపుల్ ఎన్బీకే టాక్ షో ప్ర‌తి ఎపిసోడ్‌లో సినిమా ప‌ర్స‌నాలిటీస్ ఇలా పట్టుద‌ల‌తో పైకి వ‌చ్చిన వారి స్పూర్తి నింపుతూ సాగుతోంది. ఈ ఎపిసోడ్ లో పూరిజ‌గ‌న్నాథ్ తాజాగా తెర‌కెక్కిస్తున్న లైగ‌ర్ చిత్రం టీమ్ సంద‌డి చేయ‌డం విశేషం. అందులో సంక్రాంతి పండుగ కావ‌డం మ‌రొక విశేషం. బాల‌య్య కూడా వెరైటీగా ఈసారి పండుగ అనో ఏమో అడ్డ పంచె క‌ట్టి క‌నిపించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

unstoppable

Advertisement

Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను బాల‌కృష్ణ నీ ఫ‌స్ట్ పిక్చ‌ర్ ఏది అని అడ‌గ‌గా స‌మాధానం చెప్ప‌లేక‌పోయాడు. దాంతో ఆ త‌రువాత బాల‌య్య నాకు బాల‌న‌టుడు అంటే చాలా బాగా ఇష్టం అని.. నీ సినిమాలో పెట్టుకుంటావా..? అని విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అడిగాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ అందుకు షాక్‌కు గుర‌వుతాడు. ఆ డ‌బ్బింగ్ నేను కాదు.. ఆ మనిషిని నేనే.. కానీ డ‌బ్బింగ్ నాది కాదు. పుట‌ప‌ర్తి సాయిబాబా వ‌ద్ద ఓ సీరియ‌ల్ తీసారు. అందులో విజ‌య్ కూడా న‌టించాడు. విజ‌య్ డైలాగ్ చెప్పగ‌లిగే వారికి ఒక్కొక్క‌రికీ ఒక డైలాగ్ ఇచ్చారు అని చెప్పాడు. నువ్వు అవుత‌లి వారికి డైలాగ్ లేకుండా చేస్తావు అని వారికి తెలియ‌దు అని బాల‌కృష్ణ పేర్కొన్నారు.
 ‘అర్జున్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన అభిమానులను చూసి ఆశ్యర్యపోయాను. ఆ తర్వాత వారిని ఉద్దేశించి డియర్ రౌడీస్ అంటూ సంభోదించాను. అలా రౌడీ బ్రాండ్ పడిపోయింది. ఇక షోలో బాలయ్య.. విజయ్ దేవరకొండ బాక్సింగ్ చేసారు. (Twitter/Photo)
ఇక ఆ తరువాత పూరి జగన్నాథ్ ను “మైక్ టైసన్ బర్త్ డే ఎప్పుడు అని అడిగారు బాల‌య్య‌. అందుకు ఛార్మి ఇయర్ 1966 అని తెలుసు కానీ, డేట్ అంటూండగానే బాలయ్యనే జూన్ 30 అని చెప్పారు. ఛార్మిని ఆమె ఫస్ట్ సినిమా విడుద‌ల తేదీ ఎప్పుడు అని అడిగారు. అందుకు ఆమె సమాధానం చెప్పలేదు. చివరగా విజయ్ ని అడిగిన ప్రశ్నకు “ఆగస్టు 25 – లైగర్ విడుద‌ల తేదీ అని చెప్పారు. ఇక ‘లైగర్’ ట్రైలర్ ప్ర‌ద‌ర్శించి.. ఈ సినిమా నేషనల్ లెవెల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా కావాలని బాలయ్య ఆకాంక్షించారు.

Visitors Are Also Reading