Home » Chanakya Niti : ల‌క్ష్మిదేవి అనుగ్ర‌హం పొందాలంటే కొన్ని అల‌వాట్ల‌కు దూర‌మ‌వ్వాల్సిందే..?

Chanakya Niti : ల‌క్ష్మిదేవి అనుగ్ర‌హం పొందాలంటే కొన్ని అల‌వాట్ల‌కు దూర‌మ‌వ్వాల్సిందే..?

by Anji
Ad

ఆచార్య చాణ‌క్యుడి గొప్ప‌త‌నం గురించి అంద‌రికీ తెలిసిన‌దే. ముఖ్యంగా మ‌నిషి జీవించే విధానం.. ఆనాటి కాలంలోనే ఈ నాటి గురించి వివ‌రించారు. అందులో ఓ వ్య‌క్తి అల‌వాట్ల‌ను బ‌ట్టే మంచి, చెడు అని నిర్ణ‌యిస్తారు. మంచి అల‌వాట్ల‌ను అల‌వ‌రుచుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు స్పూర్తిగా నిల‌వ‌డ‌మే కాకుండా గౌర‌వం.. కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదిస్తారు. త‌ప్పుడు అల‌వాట్ల‌ను క‌లిగిన వ్య‌క్తి త‌న జీవితాన్నీ తానే స్వ‌యంగా నాశ‌నం చేసుకున్న వాడ‌వుతాడు. చాణ‌క్య నీతి పుస్త‌కంలో అలాంటివి కొన్ని అల‌వాట్ల‌ను పేర్కొన్నాడు.

Chanakya Niti stri : quotes vichar thoughts updesh never share your secrets  with anybody it will destroy you even  men-should-not-tell-these-4-things-their-wife - Astrology in Hindi - Chanakya  Niti : हमेशा राज रखना चाहिए

Advertisement

ఒక వ్య‌క్తి చెడు అల‌వాట్ల‌ను క‌లిగి ఉంటే ల‌క్ష్మిదేవి అనుగ్ర‌హాన్ని పొంద‌లేడు. దీంతో కుటుంబంలో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. పేద‌రికం ఉంటుంది. ఎవ‌రైనా జీవితంలో ఆనందం, సంప‌ద‌ను పొందాల‌నుకుంటే కొన్ని అల‌వాట్ల‌ను పెంపొందించుకోవాలి. అవి ఏమిటంటే..?

Chanakya Niti: Only these 5 things give progress in career you should also  know - Astrology in Hindi - चाणक्य नीति: इन 5 बातों से ही करियर में मिलती  है तरक्की, आप भी जान लीजिए

రోజు దైవాన్ని స్మ‌రించే అల‌వాటు పూజ చేయ‌డం వ‌ల్ల మ‌నిషి ఆలోచ‌న‌లు మంచి వైపు మ‌ర‌లుతాయి. ఇంటి వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా ఉంటుంది. అందుకే ప్ర‌తీ వ్య‌క్తి పూజ‌లు చేయాలి. నిత్య పూజ జ‌ర‌గ‌ని ఇంట్లో ప్ర‌తికూల ప‌రిస్తితులు ఏర్ప‌డుతాయి. అటువంటి వారి ఇంట్లో ల‌క్ష్మిదేవి ఎప్పుడు ఉండ‌దు.

Advertisement

Chanakya Niti: ऐसे लोगों का जीना भी होता है दुश्वार, दूसरे लेते हैं लाभ,  जानें क्या कहती है चाणक्य नीति - Chanakya Niti Life Lesson Quotes chanakya  neeti in hindi how to

ల‌క్ష్మిదేవి ఎప్పుడు ప‌రిశుభ్ర‌త‌నే ఇష్ట‌ప‌డుతుంది. విడిచిన బ‌ట్ట‌లు ధ‌రించే వారు, ప‌ళ్లు శుభ్రం చేసుకోని వారు ఇంటిని మురికిగా ఉంచేవారు, ఉన్న ఇంట్లో ల‌క్ష్మిదేవి ఎప్పుడు నివ‌సించ‌దు. అటువంటి వారు ఎప్పుడు రోగాల బారిన ప‌డ‌తారు. అంతేకాదు. ధ‌న న‌ష్టాన్ని కూడా పొందుతారు. క‌నుక ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్మిదేవి అనుగ్రహం పొందాలంటే.. ఇల్లు, శ‌రీరం ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఎవ‌రి ఇంట్లో ఎప్పుడు గొడ‌వ‌లు జ‌రుగుతాయో.. అటువంటి వాతావ‌ర‌ణం ఉండే ఇంటి ప‌ట్ల కూడా ల‌క్ష్మిదేవి అసంతృప్తిగానే ఉంటుంది. అలాంటి వారి ఇంటిపై ల‌క్ష్మిదేవి అనుగ్ర‌మం ఉండ‌దు. ఎవ‌రైనా ల‌క్ష్మిదేవి అనుగ్ర‌మం పొందాల‌నుకుంటే కుటుంబంలో ప్రేమ‌, స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉండేవిధంగా చూసుకోవాలి.

పెద్ద‌ల‌తో అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించేవారు వృద్ధుల‌ను అవ‌మానించే వారు, నిస్స‌హాయుల‌ను వేధించే వారిపై కూడా ల‌క్ష్మిదేవి ఆగ్ర‌మం వ్య‌క్తం చేస్తుంది. వారి ఇంట్లో స‌మ‌స్య‌ల వ‌ల‌యం కొన‌సాగుతూనే ఉంటుంది. ఆనందానికి తావు ఉండ‌దు. వృద్ధుల‌ను, పెద్ద‌ల‌ను గౌర‌వించ‌డం అల‌వ‌రుచుకోవ‌డం ఉత్త‌మం.

Visitors Are Also Reading