అతిగా ఆవశపడే వాళ్ళు, అనవసరంగా వాదిస్తూ సాగదీసే వాళ్లు, తమ డబ్బు తామే కొట్టుకునే వాళ్ళు, కేవలం డైలాగులకే పరిమితమయ్యే వాళ్ళు, వెనకాల గోతులు తవ్వే వాళ్ళు, కిచెన్ కే పరిమితమై ఆడటమే మరిచిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్ లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్ లో అలాంటివారు ఉన్నారు. అయితే మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కిచెన్ కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్ లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు.
అందరికీ వండి పెట్టడం మంచిదే కానీ, వంట మాత్రమే చేస్తే కష్టం. దామిని విషయంలోనూ అదే జరిగింది. ఎప్పుడు చూసినా వంటగదిలోనే పనులు చేసుకుంటూ పోయింది. కిచెన్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఎవరూ పని చేయకపోయినా నోరేసుకుని పడిపోయేది. అందుకే ఆమెకు వంటలక్క, వార్డెన్ అన్న పేర్లు కూడా ఇచ్చేశారు నేటిజన్లు. కేవలం కిచెన్ కే పరిమితమై ఆటకు దూరమవ్వవడమే తన ఎలిమినేషన్ కు ప్రధాన కారణం. కొన్నిసార్లు తన మాటలకు, వైఖరికి అసలు పొంతన ఉండేది కాదు. బూ*లు మాట్లాడితే నచ్చదని చిరాకు పడ్డ థామిని తాను మాత్రం ఇంగ్లీష్ లో తెగ బూతులు మాట్లాడింది.
Advertisement
Advertisement
ఇక్కడ ఆమెపై విమర్శలు వచ్చాయి. పాటలతో మెప్పించిన సింగర్ ఆటలో, మాటలో మెప్పించలేక పోయింది. ఓ టాస్క్ లో అయితే ప్రిన్స్ ను వీర లెవల్లో టార్చర్ పెట్టింది. పేడ ముఖాన కొట్టడమే కాకుండా.. తన నోటిలో కూడా వేసింది. ఇది టాస్కే అయినప్పటికీ గ్యాప్ ఇవ్వకుండా నోటిలో పేడ కొట్టడం అస్సలు కరెక్ట్ కాదన్న కామెంట్స్ వినిపించాయి. ఏదేమైనా ఇంకొన్ని వారాలు ఉంటాను అనుకున్న దామిని ఆలోచనను పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ తనను మూడో వారంలోనే ఎలిమినేట్ చేశాడు. ఇన్ని వారాలకుగానూ ఆమెకు ఎంత పారితోషికం ముట్టిందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ బాహుబలి సింగర్ వారానికి రూ.2 లక్షల మేర పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మూడు వారాలకు గాను రూ.6 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు.. జయంరవి కామెంట్స్ వైరల్..!
బిగ్ బాస్ నుంచి థామిని ఎలిమినేట్ అవ్వడానికి 5 కారణాలు ఇవే..!