కోలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి.. ఇండియా మొత్తంలో ఫాలోయింగ్ ఏర్పరచుకుని బడా సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు హీరో సూర్య. గత ఏడాది బెస్ట్ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు సూర్య. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తున్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో మరింత జోష్ తో సినిమాలు చేస్తున్న సూర్య.. ఇప్పుడు పాన్ ఇండియాపై టార్గెట్ పెట్టాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబంలో కలహాలు చెలరేగాయని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో తాజాగా దీనిపై సూర్య తమ్ముడు కార్తీక్ స్పందించాడు.
Advertisement
తమిళ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో సూర్య తన తల్లిదండ్రులు శివకుమార్, లక్ష్మీతో పాటు సోదరుడు కార్తీతో కలిసి చాలాకాలంగా చెన్నైలోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి కుటుంబం అయినా వీళ్లంతా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. అలాంటిది కొద్ది రోజుల క్రితమే హీరో సూర్య తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబై నగరానికి షిఫ్ట్ అయిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. కానీ సూర్యని ఓ విలేకరీ ప్రశ్నించగా.. తమ పిల్లలు మాత్రమే ముంబైలో ఉన్నారని.. మేము ముంబైలో ఉండటం లేదని ఓ క్లారిటీ ఇచ్చాడు.
Advertisement
ముంబై నగరానికి మకాం మార్చేసిన సూర్య అక్కడ ఏకంగా రూ.70 కోట్లతో ఓ ఇల్లు కొనుగోలు చేశాడని.. ఇకపై అక్కడే ఉండబోతున్నాడని కొద్ది నెలల క్రితమే న్యూస్ బయటకు వచ్చింది. దీనికి తోడు ఆ సమయంలోనే సూర్య ముంబైలోని ఓ ఇంటి నుంచి బయటకు వచ్చి హోటళ్లకు వెళ్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో సూర్య షిఫ్ట్ అయింది నిజమే అంటున్నారు. వాస్తవానికి సూర్య అక్కడ ఓ ప్లాట్ కొనగోలు చేసినట్టు తెలుస్తోంది. చూడాలి మర ఏం జరుగుతుందనేది.