Home » బిగ్ బాస్ నుంచి థామిని ఎలిమినేట్ అవ్వడానికి 5 కారణాలు ఇవే..!

బిగ్ బాస్ నుంచి థామిని ఎలిమినేట్ అవ్వడానికి 5 కారణాలు ఇవే..!

by Anji
Ad

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం అనూహ్యంగా సింగర్ థామిని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.  వాస్తవానికి  ప్రతి బిగ్ బాస్ సీజన్ లో మూడోవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఈసారి అందరూ ఊహించినట్లుగానే అన్ అఫీషియల్ పోలింగ్ లో థామిని లీస్ట్ లో ఉండటం వల్ల థామిని ఎలిమినేట్ అయింది. అయితే అసలు థామిని ఎలిమినేషన్ కి  గల 5 ముఖ్యమైన కారణాలను ఇప్పుడు మనం చూద్దాం. 

Advertisement

  1. ఈవారం థామినిని ఇద్దరు నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ థామిని బాసన్లు తోమేటపుడు తన బిహేవియర్ నచ్చలేదని తను వండేటపుడు F* అనే మాట మాట్లాడిందని నామినేట్ చేశాడు. అలాగే, ప్రిన్స్ తనని టార్గెట్ చేసిందని అస్తమానం నాకే వర్క్ చెప్తోందని నామినేట్ చేశాడు. ఈ రెండు కూడా చాలా సిల్లీ రీజన్స్ అనిపించాయి.
  2. థామిని ఎక్కువ సేపు కిచెన్ లోనే ఉండిపోయింది. లాస్ట్ వీక్ ఇదే విషయంలో తను బాగా బాధపడింది. ఇక్కడ నేను అందరికీ వంటలక్క అయిపోయానని చెప్పింది. ఈవారం నుంచీ అస్సలు వంట చేయనని చెప్పింది. అంతేకాదు, ప్రిన్స్ తో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. తను చేసింది అంతా డ్రామా అని చెప్పేసరికి థామినీ నామినేషన్స్ లో క్లారిటీ లేకుండా పోయింది. దీనివల్ల తనకి ఓట్లు వేసేవారి సంఖ్య తగ్గిపోయింది.
  3. ఫస్ట్ వీక్ థామిని నామినేషన్స్ లోకి వచ్చిన అక్కడ తనకంటే వీక్ అయిన కిరణ్ రాథోడ్ ఉంది కాబట్టి సేవ్ అయ్యింది. ఆ వారమే తనకి ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా లేకుండా పోయింది. ఆడియన్స్ ని కూడా సపరేట్ గా తనకంటూ సృష్టించుకోలేకపోయింది.

Advertisement

4. ఆటలో థామిని తన ప్రత్యేకతని చూపించలేదు. కంటెంట్ ఇవ్వడం కోసం పరితపించలేదు. తన తోటి హౌస్ మేట్స్ ఏదో ఒక విషయంలో కంటెంట్ ఇస్తునే ఉన్నారు. శోభాశెట్టి – రతిక – ప్రియాంక వీళ్లు ఆటలో దూసుకువెళ్లారు. కానీ, థామినీ అక్కడే ఉండిపోయింది. తన జోన్ లో గిరి గీసుకుని ఉండటం వల్లే ఎలిమినేట్ అయింది. 

5. సోషల్ మీడియాలో థామినికి పెద్దగా ఫాలోయింగ్ లేదు. కేవలం తన పాటలతోనే కొంతమంది ప్రత్యేకమైన అభిమానులని సంపాదించుకుంది. ఫాలోవర్స్ మాత్రం కొద్ది పర్సెంటేజ్ లోనే ఓటు వేశారు. అంతేకాదు, ఈవారం తనతోపాటుగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన రతిక, ప్రియాంక, నామినేషన్స్ లో ఉన్నారు. అలాగే అమర్ దీప్, గౌతమ్, ప్రిన్స్ యావార్ లకి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరగడం వల్ల థామినీకి ఓటింగ్ తగ్గిపోయింది. అన్ అఫీషియల్ సైట్స్ లో కూాడ థామినికి ఓటింగ్ తగ్గిపోయింది. అందుకే, ఎలిమినేట్ అయింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాలయ్య లయన్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా ?

బోయపాటి ‘స్కంద’ మూవీకి క్లైమాక్స్ గురించి వింటే చూడకుండా ఉండలేరు..!

 

Visitors Are Also Reading