తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పక్క ఆధారాలు కోర్టుకు సమర్పించి… చంద్రబాబు నాయుడును రాజమండ్రి జైలుకు పంపించారు ఏపీ సిఐడి అధికారులు. ఇగ నిన్న మరియు ఇవాళ కోర్టు ఆదేశాల మేరకు ఏపీ సిఐడి కస్టడీని ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు.
Advertisement
కాసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కస్టడీ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులపాటు చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగారని అందరూ చర్చించుకుంటున్నారు. దాదాపు 100 ప్రశ్నలు చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా 10 ప్రశ్నలు మాత్రం కీలకమైనవని సమాచారం. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
- 3300 కోట్ల ప్రాజెక్ట్ అని ఎలా నిర్ణయించారు ?
- సిమెన్స్ కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు ?
- అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది ?
- జీవో కు విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు ?
- ఆర్థిక శాఖ అభ్యంతరాలు పట్టించుకోకుండా నిధులు రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎందుకు ఒత్తిడి చేశారు ?
- 13 చోట్ల మీ సంతకాలే ఉన్నాయి… అలా సంతకాలు పెట్టి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు ?
- డిజైన్ టెక్ కంపెనీకి తరలించిన నిధుల గురించి మీకు తెలుసా ?
- నిధులు తరలించిన మనోజ్ పార్థసారథి తో మీకున్న సంబంధం ఏంటి ?
- పెండ్యాల శ్రీనివాస్ రావుకు నిధులు అందించిన విషయం మీకు తెలుసా ?
- ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు ఇవ్వగానే వారెందుకు విదేశాలకు పారిపోయారు ?
- ఈ ప్రశ్నలన్ని సిఐడి డిఐజి ధనుంజయుడు ఆధ్వర్యంలో చంద్రబాబును అడిగారు. అయితే ఈ ప్రశ్నలకు చంద్రబాబు క్లారిటీగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ విజేతకు రూ. 33 కోట్లు..ఆ ట్రోఫీ ధర ఎంతో తెలుసా..?
- యాంకర్ ఝాన్సీ భర్త రెండో పెళ్లి ..అసలు కారణం ఏంటీ?
- బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు…కానీ YSR కాపాడారు – పోసాని సంచలనం