Home » యాంక‌ర్ ఝాన్సీ భ‌ర్త రెండో పెళ్లి ..అసలు కారణం ఏంటీ?

యాంక‌ర్ ఝాన్సీ భ‌ర్త రెండో పెళ్లి ..అసలు కారణం ఏంటీ?

by Bunty
Ad

యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా, యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఝాన్సీ ఎన్నో సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఝాన్సీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో జోగి నాయుడు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ వి వాహం. వీరు వివాహానికి ముందే 9 సంవత్సరాలు సహజీవనం చేశారు. కానీ వివాహ అనంతరం కేవలం ఒక సంవత్సరం మాత్రమే వీరిద్దరూ కలిసి ఉన్నారు.

Advertisement

ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల సమయంలో వీరికి ఒక పాప జన్మించింది. కూతుర్ని తనతో పాటు ఉంచుకుంటానని ఝాన్సీ కోర్టులో కేసు వేసింది. తన తండ్రి కూడా కూతుర్ని వదులుకోవడం ఇష్టం లేక కోర్టులో వీరి కేసు నడిచింది. అయితే కోర్టు తీర్పు ప్రకారం పాప చిన్న వయసులో తన తల్లి వద్ద, పెద్దయ్యాక తన తండ్రి వద్ద ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా తన కూతురిని వారానికి ఒకసారి చూసుకోవడానికి వీలుగా జోగి నాయుడుకి కోర్టు తీర్పునిచ్చింది. వారానికి కేవలం ఒక గంట మాత్రమే అనుమతిని ఇచ్చింది.

Advertisement

దీంతో జోగినాయుడు ప్రతివారం ఇంటికి వెళ్లి తన కూతురుతో సమయాన్ని గడిపేవాడట. ఆ సమయంలో కేవలం గంట మాత్రమే కాకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు అంటూ సమయాన్ని గడిపేవాడట. తన పాప కోసం అప్పుడప్పుడు స్కూల్ కి కూడా వెళ్లి తన కూతుర్ని చూసుకునేవాడట. దీంతో ఝాన్సీ కుటుంబ సభ్యులు తీవ్ర అసహనానికి గురయ్యారట. దీంతో జోగినాయుడు పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు అతనికి రెండవ వివాహం చేశారు. ఇక వివాహ అనంతరం జోగినాయుడు పూర్తి సమయాన్ని తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇక ఝాన్సీ తన కూతురితో సంతోషంగా ఉంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading