ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం నారా బ్రాహ్మణి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అవ్వడమే కాకుండా నారా లోకేష్ కూడా మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి తగ్గట్టుగా లోకేష్ ఢిల్లీలో ఉండడంతో ఈ వార్తలకు మరింత జోరందుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఇక తాను తన పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడని వార్తలు రావడంతో నారా బ్రాహ్మణి రాజకీయంగా ఆక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబు ఆరెస్టుకు నిరసనగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. దీంతో మీడియాతో బ్రాహ్మణి మాట్లాడారు. దీంతో బ్రాహ్మణి వాక్చాతుర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నారా బ్రాహ్మణిని టిడిపి పార్టీలో యాక్టివ్ గా చేశారని అంటున్నారు. గతంలో జగన్ 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో తన తల్లి పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు.
Advertisement
Advertisement
ఇప్పుడు అదే విధంగా లోకేష్ మధ్యలో ఆపేసినటువంటి యువగలం పాదయాత్రలో నారా బ్రాహ్మణి పాదయాత్రలో పాల్గొంటారని, అంతేకాకుండా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా యువగళం పాదయాత్రను పూర్తి చేస్తారని అంటున్నారు. ఇప్పటికే లోకేష్ 200 రోజులకు పైగా పాదయాత్రను పూర్తిచేశారు. ఇక లోకేష్ పూర్తి చేయాల్సిన ప్రాంతాలను బ్రాహ్మణి, భువనేశ్వరి ఆ బాధ్యతను తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. అదే జరిగితే టిడిపి నుంచి మహిళలకు మరింత ఆదరణ వస్తుందని పార్టీ అంచనా వేసుకుంది.
ఇవి కూడా చదవండి
- చంద్రబాబు అరెస్ట్ పై “సి ఓటర్ సర్వే” సంచలనం… ఆ పార్టీకి షాక్ తప్పదా ?
- ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం లాంటి జగన్ ముందు కాదు – మంత్రి రోజా
- 64 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకోబోతున్న జయసుధ.. మరోసారి ప్రియుడితో !!