పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లో ఈనెల 19 నుంచి ఉభయ సభలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన పాత భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటు ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బ్రిటిష్ వాస్తు శిల్పులు అయిన సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్డ్ బేకర్ ఈ బిల్డింగ్ రూపొందించారు. స్వాతంత్య్ర పోరాటం, ఆ తర్వాత దేశం ఎదుగుదలను కళ్లారా చూసింది. పార్లమెంట్ పాత భవనాన్ని నిర్మించింది కూడా బ్రిటిష్ పాలకులే. అయితే దానిని నిర్మించడానికి పడిన శ్రమ, డబ్బు అంతా మనదే.
Advertisement
పార్లమెంట్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రావడంతో పాత భవనాన్ని ఏం చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇంతకీ దానిని ఏం చేస్తారు? ఆ బిల్డింగును కూల్చేసి కొత్త భవనం కడతారా లేదా మరి దేనికోసమైనా వాడతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ బిల్డింగ్ ను కూల్చివేసే ప్రసక్తే లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంటరీ కార్యకలాపాల కోసం దాన్ని వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. పాత పార్లమెంట్ భవనం దేశ పురావస్తు సంపద. అందుకే ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలని కేంద్రం నిర్ణయించింది.
Advertisement
2021 లోనే మోడీ ప్రభుత్వం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. పాత భవనానికి మరమ్మతులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. నేషనల్ ఆర్కైవ్ లను కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లోకి మార్చనున్నందున పాత భవనంలో మరింత ఖాళీ స్థలం అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. పాత భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మరికొందరూ మాత్రం ఈ భవనాన్ని ఇతర అవసరాలకు కూడా వినియోగించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పాత పార్లమెంట్ భవనాన్ని దేనికి వినియోగిస్తారనేది మరికొద్ది రోజులు గడిస్తే కానీ ఓ క్లారిటీ రాదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చంద్రబాబు అరెస్ట్ పై “సి ఓటర్ సర్వే” సంచలనం… ఆ పార్టీకి షాక్ తప్పదా ?
చెప్పిన సమయానికి వెళ్లకపోవడంతో టీడీపీ టికెట్ మిస్ చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా ?