Home » గేమ్ ఛేంజర్ సాంగ్ లీకు.. ఎవడ్రా ఆ లిరిక్స్ రాసింది అంటూ నెగిటివ్ కామెంట్స్..!

గేమ్ ఛేంజర్ సాంగ్ లీకు.. ఎవడ్రా ఆ లిరిక్స్ రాసింది అంటూ నెగిటివ్ కామెంట్స్..!

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈచిత్రం ప్రకటించగానే పాన్ ఇండియా రేంజ్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా అంతే ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంది. మరోవైపు శంకర్ ఇండియన్ 2 సినిమాని స్టార్ట్ చేసి గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పీడ్ కి బ్రేకులు వేశాడు. ఈనెలలో 12 రోజులు మాత్రమే షూటింగ్ అంటూ మెగా అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. 

Advertisement

ఇక్కడి నుంచి గేమ్ ఛేంజర్ మూవీలో ఏం జరుగుతుందో శంకర్ ఏం చేస్తున్నాడో షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో అనే విషయంలో ఎవరి దగ్గర ఎలాంటిక్లారిటీ లేదు. జనవరి 26, ఆగస్టు 15, రామ్ చరణ్ బర్త్ డే ఇలా ఈవెంట్స్ అయిపోతూనే ఉన్నాయి. కానీ గేమ్ ఛేంజర్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రావడం లేదు. ఓవైపు చాలా స్లోగా జరుగుతున్న షూటింగ్.. మరోవైపు అప్డేట్ బయటికి రాకపోవడంతో పాటు ఎప్పుడు విడుదల చేయాలనే అయోమయంలో ఉన్నారు.ఇక ఈ మూడు చాలవన్నట్టు ఇప్పుడు లీకులు గేమ్ ఛేంజర్ ని కాస్త ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ షూటింగ్ జరిగినా ఏదో ఒక లీక్ బయటికీ రావడం ఓ ఆనవాయితీగా మారింది. ఫ్యాన్స్ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా రామ్ చరణ్ లుక్, సెట్ లుక్ ని, ఆర్టిస్టులను ఇలా ఏదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. 

Advertisement

తాజాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి అనే సాంగ్ లీకు అయింది. సోషల్ మీడియాలో సెన్షషన్ క్రియేట్ చేస్తోంది. ఫోక్ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ ని థమన్ ఊర మాస్ స్టైల్ లో మ్యూజిక్ కొట్టాడు. అయితే ఆ రొట్ట లిరిక్స్ ఏంటో.. అసలు ఆ లిరిక్స్ రాసింది ఎవరురా అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ సినిమాలో సాంగ్స్ అంటే చాలా బాగుంటాయి. కానీ లీకు అయిన ఈ సాంగ్ మాత్రం బేసిక్ వర్షన్ మాత్రం అయి ఉంటుంది. సింగర్స్ వచ్చి బీట్స్ అన్నీ సింక్ అయితే ఫైనల్ వర్షన్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 29 రోజుల్లో సినిమాని తీసి, 500 రోజులు ఏకధాటిగా ఆడిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?

“సైమా” అవార్డ్స్ లో రామ్ చరణ్ అందుకే అవార్డు గెలువలేకపోయారా ? ఎన్టీఆర్ కి ఎలా వచ్చిందంటే ?

Visitors Are Also Reading