Home » చంద్రబాబు జైలు లో ఉంటె ఎన్టీఆర్ ఇంత అకస్మాత్తుగా విదేశాలకు ఎందుకు వెళుతున్నారో తెలుసా ?

చంద్రబాబు జైలు లో ఉంటె ఎన్టీఆర్ ఇంత అకస్మాత్తుగా విదేశాలకు ఎందుకు వెళుతున్నారో తెలుసా ?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే. గత నాలుగు రోజులుగా బెయిల్ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. చంద్రబాబు అరెస్టయిన తరువాత టీడీపీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు లేరు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ జరుగుతోంది. 

Advertisement

టీడీపీలో ఎంతోకాలంగా ఉన్న సీనియర్లు నారా లోకేష్ మాట వినే పరిస్థితిలో ఎవ్వరూ  లేరు. ఇక ఇదే సమయంలో బాలయ్య రంగంలోకి దిగి నేనున్నానని చెప్పినప్పటికీ బాలయ్య ఎంతో కాలం పార్టీని ఏకతాటి మీద ముందుకు నడిపించేలా లేరనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. టీడీపీ సంక్షోభంలో ఉన్న ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ పై, టీడీపీ విషయంలో కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేవీ పట్టనట్టు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సైమా వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సంక్షోభంలో ఉన్న సమయంలోనే తాతపై అమితమైన ప్రేమను ప్రదర్శించే మనువడైన జూనియర్ ఎన్టీఆర్ ఈ కష్టకాలంలో నేను ఉన్నానని.. ముందుకు రాకపోవడం టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేస్తుంది. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి మైలేజ్ ఇస్తుందనుకుంటే.. ఊహించనివిధంగా చంద్రబాబు బెయిల్ కూడా దొరక్క.. బయటికి రాలేని పరిస్థితులు రావడంతో తెలుగు తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నేనున్నానని జూనియర్ ఎన్టీఆర్ భరోసా కల్పిస్తారనుకుంటే.. అసలు రాజకీయాలకే తను దూరం అన్నట్టుగా సైమా అవార్డుల ఫంక్షన్ కి ఫ్యామిలీతో తారక్ దుబాయ్ వెళ్లడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీస్తుంది.

Visitors Are Also Reading