Home » చంద్రబాబు అరెస్టుతో కుప్పకూలిన హెరిటేజ్ కంపెనీ షేర్ల విలువ..! అమ్మాలా లేక కొనాలా..?

చంద్రబాబు అరెస్టుతో కుప్పకూలిన హెరిటేజ్ కంపెనీ షేర్ల విలువ..! అమ్మాలా లేక కొనాలా..?

by Mounika
Ad

మాజీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్మాక్ కేసులో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కోర్టులో వాదనల తర్వాత చంద్రబాబును 14 రోజుల పాటు రిమాండుకు పంపారు. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ లేదని, విచారణలో నిజమని తేలితే చంద్రబాబు నాయుడుకు పదేళ్ల జైలుశిక్ష పడుతుందని అంటున్నారు.

Advertisement

చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరు పూర్తిగా అనైతికమని, సరైన ఆధారాలు లేకుండా, కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని  తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఒక్కో పార్టీలోని పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండించారు

Advertisement

ఇక చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఈ మెుత్తం పరిణామాల ప్రభావం ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం సెప్టెంబర్ 12, 3.00 గంటల సమయానికి హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ఎన్ఎస్ఈలో 10.74 శాతం క్షీణించి రూ.226.00 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇక బీఎస్ఈలో స్టాక్ ధర 10.69 శాతం క్షీణించి రూ.226.85 వద్ద ట్రేడ్ అవుతూ నష్టాల బారిలో నడుస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ షేర్లలో నేడు రేపు ఇదే ధోరణి కొనసాగుతుందని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కొందరు ఇన్వెస్టర్లు 2024 ఎన్నికల తర్వాత షేర్లు కొనుగోలు చేయటం ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరు ప్రస్తుతం తక్కువ ధరలకు షేర్లు కొనుగోలు చేసి హోల్డ్ చేయటం ద్వారా ఎన్నికల తర్వాత టీడీపీ గెలిస్తే మంచి లాభాలను పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు

Also read :

తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?

పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ కి చేరాలంటే ఇద్దోక్కటే మార్గమా ? దీనికి ఇండియా నే సహాయం చెయ్యాలా ? ఎలాగంటే ?

 

Visitors Are Also Reading