ఆసియాకప్ లో పాకిస్తాన్-భారత్ రెండు సార్లు తలపడ్డాయి. మొదటిపోరులో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. సూపర్-4లో తలపడ్డ టీమిండియా పాక్ మ్యాచ్ కు వర్షం అంతరాయం ఏర్పడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ ఫోర్లు, సిక్సర్లతో దూకుడుగా ఆడారు. రోహిత్ తన క్లాస్ ఆటతో పాక్ బౌలర్లను ఇబ్బంది పెడితే గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
రోహిత్ శర్మ 56, గిల్ 58 పరుగులతో హాఫ్ సెంచరీ బాధారు. వీరిద్దరూ వరుస ఓవర్ లో అవుట్ అవ్వడంతో భారత్ పై కొంత ఒత్తిడి పడింది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కుదురుకొని జోరు పెంచే సమయంలో వర్షం మొదలయింది. దీంతో మ్యాచ్ ఫలితం రిజర్వ్ డేకు మారింది. నిన్న ఆదివారం 24.1 ఓవర్ల వరకు కొనసాగగా… ఈరోజు రిజర్వ్ డే రోజు భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల నుంచి ప్రారంభం అయింది. అంటే మొత్తం 50 ఓవర్ల మ్యాచ్ ను నిర్వహించారు.
Advertisement
Advertisement
అయితే రిజర్వుడేలో భాగంగా ఇవాళ బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ రెచ్చిపోయి ఆడారు. వీళ్ళ దాటికి 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది టీమిండియా. ఇందులో విరాట్ కోహ్లీ 122 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 111 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్ జట్టు 357 రన్స్ చేజింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈరోజు కూడా కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా? రద్దు అవుతుందా? అన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది.
ఇవి కూడా చదవండి
తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?
కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రేమాయణం..ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా..?
నా కొడుకును బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు… విజయ్ తండ్రి బయట పెట్టిన సీక్రెట్..!