ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని పొందడానికి చూస్తూ ఉంటారు. మీరు కూడా అందమైన కురుల కోసం చూస్తున్నారా..? తల స్నానం చేసినప్పుడల్లా జుట్టు రాలిపోతూ ఉంటోందా..? అలా రాలిపోకుండా ఉండాలని అనుకుంటే ఇలా చేయండి. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలుతుంది. చుండ్రు కూడా వస్తోంది ఈ సమస్యలు తొలగిపోవాలంటే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ తో కాదు. చిన్న చిన్న ఇంటి చిట్కాలతో సమస్యలకి చెక్ పెట్టొచ్చు.
Advertisement
Advertisement
ఒక ఆరు మందార ఆకుల్ని తీసుకుని, నాలుగు మందార పువ్వులను తీసుకోండి. శుభ్రంగా వీటిని కడిగి పక్కన పెట్టుకోండి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒకటిన్నర గ్లాసులు వరకు నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగాక మందార ఆకుల్ని పువ్వుల్ని వేసేయండి అలానే ఇందులోనే రెండు స్పూన్ల కలోంజి గింజల్ని వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించుకోండి. పొయ్యి ఆపేసి వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత వేప నూనె వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోసుకోండి. తలకి బాగా పట్టించి ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేసి గంట వరకు అలా వదిలేసి తర్వాత కుంకుడు కాయతో తలస్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు అస్సలు రాలేదు.
Also read:
- అద్దంపై నీటి మరకలను.. ఇలా సులభంగా క్లీన్ చెయ్యండి..!
- గుత్తులుగా గులాబీ పూలు పూయాలంటే.. ఇలా చేయండి..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు