Home » Miss Shetty Mr Polishetty Telugu review: ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా హిట్టా, ఫట్టా..?

Miss Shetty Mr Polishetty Telugu review: ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా హిట్టా, ఫట్టా..?

by Sravya
Ad

Miss Shetty Mr Polishetty Telugu review : రధన్ సంగీత దర్శకత్వం వహించారు. వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళి శర్మ, జయసుధ, అభినవ్ గోమాతమ్, సోనియా దీప్తి, తులసి తదితరులు ప్రధాన పాత్రల్లో కనపడి అందరినీ బాగా మెప్పించారు. మహేష్ బాబు పి సినిమా కి దర్శకత్వం వహించారు.

Advertisement

సినిమా: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళి శర్మ, జయసుధ, అభినవ్ గోమాతమ్,
సోనియా దీప్తి, తులసి తదితరులు
నిర్మాత : వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం : రధన్
దర్శకుడు : మహేష్ బాబు పి
రిలీజ్ డేట్: 07-09-2023

కథ మరియు వివరణ:

అన్విత (అనుష్క శెట్టి) చెఫ్. ఆమె తన తల్లి తో పాటు లండన్ లోనే కలిసి ఉంటుంది. ఆమె తల్లి, తండ్రి విడిపోతారు. సో ఆమె తల్లితో పాటుగానే ఉంటుంది. మ్యారేజ్, లవ్ మీద అస్సలు అన్విత కి నమ్మకం లేదు. అందుకే ఒంటరిగానే ఉంటుంది. కానీ ఆమె తల్లి ఆమెకి పెళ్లి చేయాలని చూస్తుంది. ఆమె తల్లి చనిపోయిన తర్వాత ఒక బిడ్డ కావాలని అనుకుంటుంది అన్విత. దానితో ఐయుఐ (స్పెర్మ్ డోనర్) కోసం చూస్తుంది. స్టాండప్ కమెడియన్ అయిన సిద్దు పోలిశెట్టి (నవీన్) ని కలుసుకుంటుంది. స్పెర్మ్ డొనేషన్ కోసం ఎంపిక చేసుకుంటుంది. ఆమె కి సిద్ధూ కి మధ్య ఏం అవుతుంది..?, బిడ్డని ఆమె కంటుందా..? ఆఖరికి వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

స్టాండప్ కమెడియన్ గా నవీన్ బాగా అలరించారు. తన కామెడీతో కట్టి పారేసారు నవీన్. అలానే అనుష్క శెట్టి కూడా బాగా నటించారు. ఈ సినిమాలో అనుష్క బోల్డ్ గా కనబడుతుంది. ఒక NRI పాత్ర ఆమెది. ఆమె నటన కూడా బాగుంది. అలానే ఈ మూవీ లో మురళీ శర్మ, జయసుధ, నాజర్, అభినవ్ గౌతం కూడా బానే నటించారు. గోపి సుందర్ బిజిఎం ఒకేఒకేగా వుంది.

డైరెక్టర్ మహేష్ బాబు కొత్తగా ఈ కథని తెర మీదకి చాలా చక్కగా తీసుకు వచ్చారు. దర్శకత్వం స్కిల్స్ అయితే బాగున్నాయి. కొన్ని కామెడీ సీన్లు, ఎమోషనల్ సీన్లు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ని కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత రేంజ్ లో లేవు.

ప్లస్‌ పాయింట్స్‌:

నవీన్ పోలిశెట్టి నటన
కామెడీ
నటులు
డైలాగులు

మైనస్‌ పాయింట్స్‌:

బీజీఎం
సంగీతం
ప్రొడక్షన్స్ వేల్యూస్

రేటింగ్‌ : 2.75/5

Also read:

Visitors Are Also Reading