ఎంత మంచి స్నేహితులైనా సరే ఏదో ఒక సందర్భంలో గొడవ పడడం, విడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా స్నేహం అనేది చాలా అవసరం. కష్టాల్లో ఆదుకోవడానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తోడుగా ఉండడానికి ఒక స్నేహితుడు అవసరం. మీ స్నేహం బాగుండాలి అంటే వీటిని పాటించండి.
Advertisement
అప్పుడు మీరు మంచి స్నేహితులుగా మెలగొచ్చు. స్నేహితుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి వాటిని సర్దుబాటు చేసుకుంటే స్నేహం చిరకాలం ఉంటుంది. మీ స్నేహితులతో ఎప్పుడూ కలిసి ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ కనుక మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నా ఫోన్ చేయడం మెసేజ్ చేయడం వంటివి చేయండి. ఒకవేళ మీకు ఎక్కువ పనులు వున్నా వారానికి ఒకసారి ఫోన్ చేస్తూ ఉండండి.
Advertisement
అప్పుడు ఏ బాధ ఉండదు. స్నేహితులకి ఎప్పుడూ అండగా ఉండడం చాలా అవసరం. సపోర్ట్ ఇవ్వండి. మీరు ఎంత బిజీగా గడుపుతున్న ఎంతో కొంత ఫ్రీ టైం ఉంటుంది కదా అలాంటప్పుడు స్నేహితులతో సమయాన్ని వెచ్చించండి. స్నేహితులతో ఇప్పుడు నిజాయితీగా ఉండడం కూడా చాలా అవసరం నిజాయితీగా ఉంటే స్నేహం బాగుంటుంది బలపడుతుంది. ఆర్థిక విషయాలపై అవగాహన ఉండడం చాలా ముఖ్యం. డబ్బు ఇచ్చేసి ఎప్పుడు కూడా సెటిల్ చేసుకోవాలి. డబ్బులు వలన కూడా స్నేహితుల మధ్య గొడవలు వస్తాయి.
Also read:
- బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే.. పారిపోతాయి..!
- బ్రౌన్ రైస్ వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..? చూసారంటే ఆశ్చర్యపోతారు..!
- చాణక్య: మీ శత్రువులని ఓడించాలంటే.. వీటిని తప్పక గుర్తు పెట్టుకోండి..!