Home » పెళ్లి కాలేదు.. కానీ పిల్లాడున్నాడు.. ఆ బ్యూటీ కామెంట్స్ వైరల్.. !

పెళ్లి కాలేదు.. కానీ పిల్లాడున్నాడు.. ఆ బ్యూటీ కామెంట్స్ వైరల్.. !

by Anji
Ad

కళావాణి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తమిళ నటి ఓవియా. ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఓవియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్ కాగా.. కేరళలోని త్రిసూర్ లో జన్మించింది. మలయాళం, తమిళం,కన్నడ చిత్రాలలో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓవియా.. తన పెళ్లి గురించి ఆసక్తికర విషయం వెల్లడించింది. 

Advertisement

గతంలో  ఆమె బిగ్ బాస్ విన్నర్ అరవ్ తో డేటింగ్ లో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఈ తరుణంలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ తొలి సీజన్ లో పాల్గొన్న ఓవియా సహా కంటెస్టెంట్ ఆరవ్ తో సన్నిహితంగా ఉందని.. చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. అంతేకాదు.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే వీటిపై ఇద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ ముగిసిన తరువాత వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. ఆ తరువాత ఓవియా కాంచన-3, 90 ఎం.ఎల్ సహా పలు చిత్రాల్లో నటించింది. రెండు సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. 

Advertisement

బిగ్ బాస్ తరువాత సినిమా అవకాశాలు రాకపోవడంతో ఓవియా పెళ్లి చేసుకోనున్నట్టు రూమర్స్  వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఓవియా స్పందించింది. నాకు పెళ్లి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని.. నటనపైనే దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించింది. మీకు పెళ్లై ఓ పాప కూడా ఉందని వార్తలు వచ్చాయని ప్రశ్నించగా.. వాటికి ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది మలయాళి భామ. అవును నాకు పెళ్లి కాలేదు.. కానీ ఓ పిల్లాడు ఉన్నారు. అది నా కుక్కపిల్ల. దానిని నేను చిన్న పిల్లలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అన్నం తినిపిస్తాను.. అంతేకాదు. కుక్కపిల్ల నా పక్కనే పడుకుంటుందని సమాధానం చెప్పింది. దీంతో ఆమెపై నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. 

మరికొన్ని  ముఖ్యమైన వార్తలు : 

సమంత-నాగచైతన్య విడిపోవడానికి కారణం ఈ దోషమేనా..? అలా చేస్తే వారు కలిసి ఉండేవారా ?

జూనియర్ ఎన్టీఆర్ అలా తింటూ ఉంటారా? మహేష్ బాబు ఏమని ఏడిపించేవారంటే?

Visitors Are Also Reading