భారత క్రికెట్ జట్టు స్టార్ విరాట్ కోహ్లీ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా కోహ్లీ ప్రకటించాడు. ఏడేండ్లుగా తాను టెస్ట్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాను అని, ప్రస్తుతం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏడేండ్ల కాలం నుంచి ఎత్తు, పల్లాలు చూసానని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.
Advertisement
Advertisement
తనలో కెప్టెన్ గుర్తించి తనపై నమ్మకం ఉంచిన ధోనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. రవిశాస్త్రీతో పాటు టీమ్ మొత్తానికి థాంక్స్ చెప్పాడు కోహ్లీ. 2014 నుంచి 2022 జనవరి 15 వరకు 68 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ జట్టుకు 40 విజయాలు అందించాడు. 17 మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి పాలు అయింది. 11 మ్యాచ్‌లు డ్రాగా నిలిచాయి. 58.82 గెలుపు శాతంతో భారత జట్టు క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా కోహ్లీ నిరాజనాలు అందుకున్నాడు.
భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీకి ధన్యవాదాలు తెలిపింది. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావు అని, 68 టెస్ట్‌ల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలవడం పట్ల బీసీసీఐ కొనియాడింది.