Home » భారత్-పాక్ మధ్య పోరుపై మాజీ క్రికెటర్ తెరపైకి తీసుకొచ్చిన 5 ప్రశ్నలు ఇవే..!

భారత్-పాక్ మధ్య పోరుపై మాజీ క్రికెటర్ తెరపైకి తీసుకొచ్చిన 5 ప్రశ్నలు ఇవే..!

by Anji
Ad

క్రికెట్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆసియా కప్ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 02న భారత్ -పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ ఆడే భారత జట్టులో మొదటి రెండు మ్యాచ్ లకు కే.ఎల్.రాహుల్ అందుబాటులో ఉండడు అని బీసీసీఐ వెల్లడించిన విషయం విధితమే.

Advertisement

అయితే ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా 5 ప్రశ్నలను సంధించాడు. ప్రస్తుతం ఈ ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. తొలి పోరులో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ కి వస్తారనే దానిపై ఓ స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించాడు. కే.ఎల్.రాహుల్ తొలి రెండు మ్యాచ్ లకు దూరం అవుతున్న సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలను ఆకాశ్ చోప్రా సంధించాడు. ఈ ప్రశ్నలు ఏంటంటే? ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడా ? అలా అయితే శుభ్ మన్ గిల్ ఏ స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు ? 1,2,3 రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ వస్తే.. కోహ్లీ నాలుగో స్థానంలో వస్తాడా ?

Advertisement

అలా కాకుండా రోహిత్ శర్మ గిల్ ఓపెనర్లుగా వస్తే..  విరాట్ కోహ్లీ మూడు స్థానంలో వస్తే.. ఇషాన్ ఐదో స్థానంలో వస్తారా ? ఒకవేళ గిల్ బెంచ్ కే పరిమితమైతే తిలక్ వర్మ/ సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరు బ్యాటింగ్ కి వస్తారా ? అనే ఈ ప్రశ్నలను మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. కొందరూ బిసీసీని తప్పుబడితే.. మరికొందరూ తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరూ సూర్య కుమార్ యాదవ్ తప్పకుండా కీలక పాత్ర పోషిస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు బీసీసీఐ ఏమైనా సమాధానం చెబుతుందా ?   లేదో చూడాలి. ఒకవేళ ఎలాంటి సమాధానం రాకుంటే మాత్రం.. ఇక  నేరుగా సెప్టెంబర్ 02న మ్యాచ్ జరిగిన తరువాత క్లారిటీ వస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

క్యాండీ లో భారత్, పాక్ మ్యాచ్.. ఇరు జట్ల ప్రదర్శన ఇక్కడ ఎలా ఉందంటే..?

Asia Cup 2023 : రిజ్వాన్ బద్దకం.. విచిత్రకర రీతిలో రనౌట్?

Visitors Are Also Reading