Home » ఇలా కోడలు చేస్తే.. అత్తతో గొడవలే వుండవు..!

ఇలా కోడలు చేస్తే.. అత్తతో గొడవలే వుండవు..!

by Sravya
Ad

ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తుంది. ముఖ్యంగా అత్త, కోడలు మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అత్తగారు చేసింది కోడలికి నచ్చదు, కోడలు చేసే పని అత్తకి నచ్చదు ఇలా అత్త కోడలు మధ్య ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది. కొంతమంది అత్తా కోడళ్ళు గొడవ పడి మళ్లీ కలిసిపోతుంటే కొంతమంది మాత్రం గొడవని పెద్దది చేసుకుంటూ దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది అత్తా కోడలు కలిసి ఉండడం లేదు అత్తవారింటికి వచ్చిన వెంటనే అత్తా కోడళ్ళ మధ్య పడక భర్తతో వేరేగా వెళ్ళిపోతున్న భార్యలు చాలామంది ఉన్నారు.

Advertisement

ఇవన్నీ పక్కన పెడితే అత్తా కోడళ్ళు కలిసి ఉండాలన్న మంచిగా వాళ్ళ మధ్య రిలేషన్ ఉండాలన్న ఇవి చాలా ముఖ్యం. కోడలు కనుక ఇవి పాటించిందంటే అత్తా కోడళ్ళ మధ్య ఏ బాధ ఉండదు. కలిసి ఆనందంగా ఉండొచ్చు. వాదించకండి. వాదించడం వలన ప్రయోజనం ఏమీ లేదు. గొడవే ఇంకా పెరుగుతుంది తప్ప. నిదానంగా ఓపిగ్గా ఏ సమస్య అయితే కలిగిందో దానిని సాల్వ్ చేయండి. ఒకసారి వాళ్ళు చెప్పింది వినకపోతే సైలెంట్ గా ఉండండి తప్ప వాదించుకోవద్దు. ఒకవేళ ఒకసారి చెప్పింది వినకపోతే సైలెంట్ గా ఉండిపోవడం మంచిది.

Advertisement

అర్థం చేసుకోకపోవడం వలన చాలామంది అత్తా కోడలు మధ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా భర్త మీకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మీరు కోరుకోకండి. మీ అత్త గురించి మీ భర్తకి కంప్లైంట్ చేయకండి. ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటే అవి మీకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ అత్తగారు ఇష్టాలు లో మీ ఇష్టాలు వేరు అవ్వచ్చు మీరు ఏం చేసినా ఆవిడకి నచ్చకపోతే వీలైనంత దూరంగా ఉండండి. ఆమెను గౌరవించి పెద్దగా రియాక్ట్ అవ్వద్దు. అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వండి. ఇలా చేస్తే గొడవలు రావు.

Also read:

Visitors Are Also Reading