అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాకి కథను త్రివిక్రమ్ అందించాడు. అంతకు ముందు త్రివిక్రమ్ నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావు వంటి సినిమాలకు కథను సమకూర్చాడు. వీటితో పాటు మరో రెండు కథలు తన వద్ద ఉన్నాయని నువ్వునాకు నచ్చావ్ దర్శకుడు విజయ్ భాస్కర్ చెప్పాడట త్రివిక్రమ్. అయితే విజయ్ భాస్కర్ అందులో ఏదో ఒక కథతో త్రివిక్రమ్ ని దర్శకత్వం వహించమని సలహా ఇచ్చాడట. త్రివిక్రమ్ నువ్వే నువ్వే కథకు తరుణ్ హీరోగా సూట్ అవుతాడని అలా ఆ కథతో నువ్వే..నువ్వే.. తెరకెక్కించాడు.
దర్శకుడు విజయ్ భాస్కర్ కి మన్మథుడు కథను చెప్పాడు త్రివిక్రమ్. నాగార్జునని కలిసి త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ ఇద్దరూ సార్ మా దగ్గర కథ ఉంది.. మీకు మాత్రమే సూట్ అవుతుంది. కొంచెం వింటారా..? సార్ అని అడిగారట. వెంటనే నాగార్జున ఒప్పుకొని కథ విన్నారట. త్రివిక్రమ్ కథ చెప్పగానే నాగార్జున మోహంలో ఆశ్చర్యం కలిగింది. కథను రెండు గంటల సేపు విన్న తరువాత కానీ నాగార్జునకి కథ అర్థం కాలేదు. కథ చాలా బాగా రాశారని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగార్జున. నిర్మాత గురించి మీరేం వర్రీ కావద్దు.. ప్రతీ మూడేళ్లకొకసారి ప్రొడ్యూస్ చేేసే అన్నపూర్ణ బ్యానర్ మీద నేను ప్రొడ్యూస్ చేస్తాను అని హామి ఇచ్చారట. మీరు మిగతా కాస్టింగ్ పనులు మొదలుపెట్టండి అని చెప్పేశారు నాగార్జున. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్ ని సెలెక్ట్ చేశారు. మిగిలిన పాత్రలన్నింటికి ఆయా కాస్టింగ్ అనుకొని షూటింగ్ జరిపారు.
ఇందులో నాగార్జున హాస్పిటల్ సీనన్ ను హైదరాబాద్ లోని ఇందిరానగర్ లోని ఉషా ముళ్లపూడి ఆసుపత్రిలో చిత్రీకరించారు. క్లైమాక్స్ సీన్స్ పశ్చిమ గోదావరిలో తీశారు. ఫైనల్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న మన్మథుడు డిసెంబర్ 20, 2002న థియేటర్లోకి వచ్చాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ అందరినీ ఆకట్టుకుంది. సునిల్ కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతం అనే చెప్పాలి. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ తెలుగు సినిమాకి కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ సినిమాతోనే నాగార్జునకి మన్మథుడు అనే ట్యాగ్ లైన్ వచ్చి చేరింది. ముఖ్యంగా అప్పటికి.. ఇప్పటికీ ఎవ్వర్ గ్రీన్ సినిమా మన్మథుడు అని తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?
నాగార్జున, అమల పెళ్లికి ఏఎన్నార్ దూరంగా ఉండటానికి కారణం ఏంటి ? ఆ నిర్మాతే వీరి పెళ్లి చేశాడా ?