సాధారణంగా మనం ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా.. దానిని కాపాడుకోలేక పోతే మాత్రం పాతాళానికి పడిపోతాం అనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కొంతమంది జీవితాలు చూస్తే ఇలాగే స్పష్టంగా అర్థమవుతుంది. మనకు వచ్చినటువంటి లక్కీ ఛాన్స్ ను ఉపయోగించుకోకుండా పక్కదారులు పట్టి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటారు కొందరు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ క్రికెటర్. ఆయన చేసిన పనికి ఆ దేశ క్రికెట్ సంస్థ ఆయనను పక్కన పెట్టేసింది.. దీంతో ఆ క్రికెటర్ కనీసం 8 నెలల పాటు తన కూతురు స్కూల్ ఫీజు కూడా చెల్లించని పరిస్థితిలో ఉన్నారట.. ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ఉమర్ అక్మల్ పాకిస్తాన్ ఫేమస్ క్రికెటర్. తాను ఎంట్రీ ఇచ్చిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన గొప్ప ఆటగాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఈ వివాదంలో ఆయన దొరికిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆయనకు మూడేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో ఉమర్ అక్మల్ తన తప్పును క్షమించమని శిక్షణ తగ్గించాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ అర్బీట్రేషన్ ని ఆశ్రయించారు. దీంతో అతనికున్న మూడేళ్ల నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 2021లో తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిందట.
కానీ ఆయనకు జాతీయ జట్టులో మాత్రం చాన్స్ దొరకక చాలా సమస్యలు ఎదుర్కొన్నాడట.అలాంటి అక్మల్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమయ్యారు. నాపై నిషేధం పడ్డ సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, కనీసం నా కూతురు స్కూల్ ఫీజు కట్టలేక 8 నెలల పాటు స్కూల్ పంపలేకపోయానని అన్నారు. ఆ సమయంలో నాకు అండగా నిలిచింది నా భార్య అని, ఆమె ఎంతో సంపన్నమైన కుటుంబంలో పుట్టినా కానీ ఆ పరిస్థితుల్లో నాతో ఉండి నాకు ధైర్యం చెప్పిందని, ఆమెకు రుణపడి ఉంటానని కన్నీరు పెట్టుకున్నారు.