వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతి సీటుకు ఇద్దరి కంటే ఎక్కువగా దరఖాస్తు చేశారు. అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ దాదాపు 8 రోజులపాటు కొనసాగింది. దాదాపు 1000 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సింగర్ RRR మూవీలో నాటు నాటు సాంగు తో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధమైపోయారు.
Advertisement
హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. గోషామహల్ బలమైన అభ్యర్థి సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తో పోటీ పడేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. రాహుల్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో దించాలని రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్కార్ వేదిక మీద పాట పాడిన రాహుల్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు భారీ వెల్కమ్ చెప్పారు రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సన్మానం చేశారు.
Advertisement
ఈ తరుణంలో రాహుల్ సిప్లిగంజి త్వల్త యూట్యూబ్ గా లోకల్ సాంగ్స్ చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాలలో అవకాశాలు రావడంతో అనేక హిట్ సాంగ్స్ పాడి మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా సినిమాల్లో రాహుల్ పాటలు పాడారు. అంతేకాదు స్టార్ మా లో ప్రసారమైన బిగ్బాస్ షో త్రీ విజేతగా కూడా నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగుకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ పాటను పాడింది రాహుల్ సిప్లిగంజ్.. ఈ పాటను ఆస్కార్ వేదికపై ఆకిరత మహారాజుల మధ్య పాట పాడి అందరి మన్ననలు పొందాడు రాహుల్.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?