Home » పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ పాలు ఇవ్వండి.. ఫలితం పక్కా..!

పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ పాలు ఇవ్వండి.. ఫలితం పక్కా..!

by Anji
Ad

చాలామంది పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే ఆరోగ్యంగా ఉంటారో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఏ ఆహారం పడితే ఆ ఆహారం పెడుతూ ఒక్కోసారి పిల్లల్ని ఉబకాయులుగా తయారు చేస్తారు. మరి పిల్లలు ఆరోగ్యంగా జ్ఞాపకశక్తి మెండుగా ఉండాలంటే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గర్భిణీ స్త్రీలకు కుంకుమపువ్వు కలిపిన పాలను తాగిపిస్తూ ఉంటారు.


దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎర్రగా పుడతారని నమ్ముతారు. ఆ విధంగానే బిడ్డ పుట్టిన తర్వాత కూడా సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రతిరోజు నిద్రపోయే ముందు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఇందులో ఉండే కేసర్ రసాయనాలు బిడ్డ యొక్క మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయట. పిల్లలు ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫోన్లను పట్టుకుని గడుపుతూ ఉంటారు. మనం ఎంత సర్ది చెప్పిన ఫోన్లను విడిచిపెట్టరు. దీనివల్ల రాత్రి పూట సరిగ్గా నిద్రపోక ఏడుస్తూ ఉంటారు.

Advertisement

Advertisement

కాబట్టి రాత్రి పడుకునే ముందు వారికి తప్పనిసరిగా కుంకుమపువ్వు కలిపిన పాలు తాగిస్తే గాఢ నిద్రలోకి వెళ్లడమే కాకుండా ఎముకలు బలంగా తయారవుతాయట. ఈ పాలలో విటమిన్ ఏ, సి మాంగనీస్ వంటివి ఉంటాయి. ఇది పిల్లల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అంతేకాకుండా ఈ కుంకుమ పువ్వు కలిపిన పాలన పిల్లలకు తాగించడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా బాదం పప్పు, నానబెట్టి వాటిని మిక్సీ చేసుకుని ఆ పాలల్లో కలిపి పిల్లలకు తాగించాలి. రుచి కోసం కాస్త తేనే జోడిస్తే మంచిది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెండుగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

లావుగా ఉండటమే కాదు సన్నగా ఉండటం కూడా చాలా ప్రమాదకరం..! వారు ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 Health care : రాత్రి భోజనం తర్వాత నడవడం ఆరోగ్యానికి మంచిదా?

Visitors Are Also Reading