టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరిఇ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో పండుగ చేసుకుంటున్నారు. నిన్న భోగి వేడుకల్లో సందడి చేశారు. ఇవాళ మకర సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.
Advertisement
Advertisement
సంక్రాంతి పండుగ రోజు బాలయ్య గుర్రంపై స్వారీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. గుర్రంపై బాలయ్య కూర్చుని ఉండగానే.. ఆ గుర్రంతో డ్యాన్స్ వేయించారు. ఓ పాటను పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ.. లయబద్ధంగా గుర్రం స్టెప్పులు వేసింది. ఇక గుర్రంపై ఫుల్ జోష్తో కనిపించారు బాలయ్య. ఓ వైపు బాలయ్యను కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండగా.. మరొకవైపు అభిమానులు కూడా జై బాలయ్య.. జై బాలయ్య అనే నినాదాలతో హోరెత్తించారు. బాలయ్య సతీమణితో పాటు ఆయన కుమారుడు కూడా ఆనందంగా గడుపుతున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి ఇల్లు.. నందమూరి కుటుంబ సభ్యుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.