సాధారణంగా మహిళలు గర్భం దాల్చితే తొమ్మిది లేదా 10 నెలల్లో డెలివరీ అవుతుంటారు. కొంత మంది కొన్ని సందర్భాల్లో 7 లేదా 8 నెలల సమయంలో కూడా డెలివరీ అయ్యే అవకాశముంటుంది. మరికొందరూ కొంచెం ముందుగానే అవుతారు. కానీ ఎవరైనా 60 ఏళ్ల వరకు గర్భాన్ని మోయగలరా..? అది కూడా 90 ఏళ్లలో ప్రసవించగలరా ? వింటుంటూనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవానికి ఇది నిజంగానే ఓ మహిళకు జరిగిందండోయ్.
Advertisement
అసలు ఎవరైనా 60 ఏళ్ల వరకు గర్భాన్ని మోయగలరా ? అది కూడా 90 ఏళ్ల వయస్సులో ప్రసవించగలరా ? వింటుంటూనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా.. వాస్తవానికి ఇది నిజంగానే ఓ మహిళకు జరిగింది. వైద్యులను ఆశర్యపరిచేవిధంగా చేసిన ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. అయితే ఆ తల్లి అన్ని సంవత్సరాల పాటు తన గర్భాన్ని ఎలా మోసింది. ఇది అసలు సాధ్యమేనా అనే సందేహాలు కూడా వైద్యులను గందరగోళానికి గురి చేశాయి. ఇన్ని సంవత్సరాలు ఆమె ఎలా ఆ గర్భాన్ని మోస్తు బతికిందా అని అవాక్కయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.
చైనాలోని హువాంగ్ యుజున్ (92) అనే మహిళ 1948లో తనకి 31 ఏళ్ల వయస్సు ఉండగా గర్భం దాల్చింది. ఆ పిండం ఆమె గర్భాశయానికి బయట పెరుగుతుందని.. ఇది తల్లి, బిడ్డలకు ప్రమాదం అని వైద్యులు చెప్పారు. వెంటనే ఆమెను అబార్షన్ చేయించుకోవాలని సూచించారు. ఇలా చేస్తే.. పిండం ఎదగదని.. అబార్షన్ అవుతుందని కూడా చెప్పారు. కానీ అప్పటికే హువాంగ్ యిజున్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది. దీంతో ఆమెకు పిండాన్ని తీయించుకునే అవకాశం లేకుండా పోయింది. చివరికీ ఏదైతే అది అవుతుందని భావించి అలాగే ఉండిపోయింది. అయితే విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భవిచ్ఛితి అయినట్టుగా ఎలాంటి బ్లీడింగ్ అవ్వలేదు.
Advertisement
అలా ఆమె సంవత్సరాల తరబడి గర్భాన్ని మోస్తూనే వచ్చింది. దాదాపు 61 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికీ 90 ఏళ్ల వయస్సులో వైద్యులను ఆశ్రయించింది. అయితే వారు ఆమె పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. చివరికీ ఆమె కడుపులోపల ఉన్నటువంటి ఆ బిడ్డ చనిపోయి స్టోన్ లా మారి అలా అయిపోయిందని చెప్పారు. అసలు ఇలా జరగడం చాలా అరుదు అని.. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా ఆమె చనిపోయిన పిండంతో అలాగే ఉండిపోవడం మాత్రం చాలా షాకింగ్ గా అనిపించిందని వైద్యులు పేర్కొన్నారు. ఇక చివరికీ వైద్యులు ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆ కడుపులో ఉన్న స్టోన్ బేబిని బయటికి తీసేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలో, హువాంగ్ యుజున్ కథ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే చైనాలో కూడా చాలా మంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నారని చెప్పడానికి ఆమె కథనే నిదర్శనం అని చెబుతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :