Home » బుమ్రాకు తృటిలో తప్పిన ప్రమాదం.. మామూలుగా జంప్ చేయలేదుగా..!

బుమ్రాకు తృటిలో తప్పిన ప్రమాదం.. మామూలుగా జంప్ చేయలేదుగా..!

by Anji
Ad

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరిగ్గా 11 నెలల తరువాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవమరించాడు బుమ్రా. అతని నాయకత్వంలోనే టీమిండియాకి విజయవంతమైన ప్రారంభాన్ని అందించాడు. ముఖ్యంగా తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను తీశారు బుమ్రా. మొదటి ఇన్నింగ్ సాఫీగానే సాగినప్పటికీ.. రెండో ఇన్నింగ్ మాత్రం వర్షం ప్రభావంతో ఈ మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం.. భారత జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన టీమిండియా క్రికెట్ అభిమానులు కాస్త ఆందోళనకు గురి చేసింది. వాస్తవానికి కాయం కారణంగా ఏడాది పాటు టీమిండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. మళ్లీ గాయపడకుండా తృటిలో తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా మరోసారి గాయపడితే ఆసియా కప్, ప్రపంచ కప్ పరంగా టీమిండియాకి ఎదురుదెబ్బ తగిలినట్టేనని తెలుస్తోంది. ఈ ఘటన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో జరిగింది. టీమిండియా 14వ ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యత వాషింగ్టన్ సుందర్ పై ఉంది. ఇక ఆ ఓవర్ లోని 5వ బంతిని ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ కాంప్ ఫర్ బౌండరీకి తరలించాడు. రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ బంతిని బౌండరీ లైన్ దాటకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

రవి బిష్ణోయ్ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తి బంతిని అడ్డుకోవడానికి డైవ్ చేసాడు. మరోవైపు బుమ్రా కూడా బంతిని పట్టుకునేందుకు పరుగెత్తాడు. అయితే ఇదే సమయంలో ఒకరినొకరు ఢీ కొనే అవకాశం ఏర్పడింది. అయితే వెంటనే మేల్కొన్న బుమ్రా సకాలంలో బిష్షోయ్ పై నుంచి దూకి పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బుమ్రా ఒకవేళ దూకకపోయి ఉంటే.. బుమ్రా తీవ్రంగా గాయపడి ఉండేవాడు. అయితే అదృష్టవశాత్తు బుమ్ర కరెక్ట్ సమయానికి అలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు.  ఒకవేళ అప్రమత్తంగా లేకుంటే మాత్రం మళ్లీ కొద్ది నెలలు దూరంగా ఉండేవాడే. టీమిండియాకి కోలుకోలేని దెబ్బ తగిలేది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Tilak Varma : ఆసియా కప్ లోకి తిలక్ వర్మ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ !

 వరల్డ్ కప్ 2023లో కీపర్ ఎవరు..సంజూకు నిరాశ తప్పదా ?

Visitors Are Also Reading