సాధారణంగా సినీ ఇండస్ట్రీకి హీరో, హీరోయిన్ల మాదిరిగానే దర్శకులు కూడా చాలా మంది వస్తుంటారు. కానీ అందులో సక్సెస్ సాధించే వారు మాత్రం కొందరే ఉంటారు. ప్రతీ డైరెక్టర్ కూడా అన్ని సందర్భాల్లో హిట్ కొట్టేవిధంగా సినిమా తీయలేడు. అగ్ర దర్శకులు సైతం కొన్ని సందర్భాల్లో బోల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ 5 దర్శకులు ఎవరనేది మనం తెలుసుకుందాం.
Advertisement
రాాజమౌళి :
టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు. ఎందుకు అంటే.. ఇప్పటికే ఆయన ఇండియాలోనే టాప్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. బాహుబలి, RRR వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినిమాలు చేసేందుకు ప్లాన్ వేస్తున్నాడు దర్శక ధీరుడు.
సుకుమార్ :
రాజమౌళి తరువాత సెకండ్ పొజిషన్ లో లెక్కల మాస్టర్ సుకుమార్ రెండో స్థానంలో ఉంటాడు. ఎందుకు అంటే సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ దాదాపు రూ.1000 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఈ మూవీతో సుకుమార్ కూడా పాన్ ఇండియా దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. సుకుమార్ పుష్ప 2 మూవీతో భారీ హిట్ సాధించడానికి సిద్ధమవుతున్నాడు.
త్రివిక్రమ్ :
Advertisement
రాజమౌళి, సుకుమార్ తరువాత ఈ లిస్ట్ లో మరో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మాటల మాంత్రికుడు అలా వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దీంతో ఈయన టాప్ 3 ప్లేస్ లో నిలిచాడు. వాస్తవానికి త్రివిక్రమ్ టాప్ 2లోనే ఉండాలి. కానీ పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు కాబట్టి టాప్ 3లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం మూమీ చేస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నా త్రివిక్రమ్.
బాబీ :
త్రివిక్రమ్ తరువాత దర్శకుడు బాబీ (కే.ఎస్.రవీంద్ర) టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఈయన ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీ చేసి మంచి సక్సెస్ సాధించాడు. దీంతో టాప్ లిస్ట్ లో చేరిపోయాడు బాబీ. ప్రస్తుతం బాబీ బాలయ్యతో ఈ మూవీ చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు.
అనిల్ రావిపూడి :
రాజమౌళి తరువాత సక్సెస్ దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అనే చెప్పాలి. రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమా ఏ ఒక్కటి కూడా హిట్ కాకుండా లేదు. అలాగే అనిల్ రావిపూడి సినిమాలు కూడా దాదాపు అలాగే హిట్ అయ్యాయి. ఈయన తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మూవీ రూ.200 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటివరకు కలెక్షన్ల పరంగా వీళ్లు టాప్ లో కొనసాగుతున్నారు. మళ్లీ వేరే దర్శకులు కూడా వారి సినిమాలతో సక్సెస్ సాధిస్తే వాళ్లు కూడా ఈ లిస్ట్ లో చేరే అవకాశముంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నాగ చైతన్య కి సమంత విడాకులు ఇవ్వడానికి కారణం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!
పెళ్లి తేదీ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.. అప్పుడేనా ?