Home » ఆధార్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక.. కీలక ప్రకటన చేసిన యూఐడీఏఐ

ఆధార్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక.. కీలక ప్రకటన చేసిన యూఐడీఏఐ

by Anji
Ad

ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ షేర్ చేయమని ఏదైనా వాట్సాప్ మెసేజ్ లేదా ఈ మెయిల్ వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటి ఆఫ్ ఇండియా హెచ్చరిక జారీ చేసింది. దీని గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం.

aadhar-card-update

Advertisement

ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటంతో సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని యూఐడీఏఐ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఆధార్ అప్డేట్ కోసం ఈ మెయిల్ లేదా వాట్సాప్ మెసెజ్ రూపంలో సందేశాలను పంపించకూడదని.. అలాంటి వాటిని ఎవ్వరూ నమ్మవద్దని తెలిపింది. ఏదైనా ఆధార్ అప్డేట్  కి సంబంధించిన సమస్యలు పరిస్కరించుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా అర్థమవుతోంది. ఆధార్ అప్డేట్ లో భాగంగా ఎవ్వరూ కూడా తమ వివరాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపించకూడదని స్పష్టమవుతోంది. ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు దాటిన వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు సందర్భాల్లో వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. దీనికి చివరి గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఇక ఇప్పటివరకు అప్డేట్ చేసుకోని వారు సెప్టెంబర్ 14 లోపు చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం మీ ఆధార్ ని అప్డేట్ చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు

యూట్యూబ్ లో కనిపించే ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

నిహారికను గెలికిన నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చిన సాయితేజ్ !

Visitors Are Also Reading