Home » జెండా ఎగురవేసే సమయంలో చేయకూడని తప్పులు ఇవే..!

జెండా ఎగురవేసే సమయంలో చేయకూడని తప్పులు ఇవే..!

by Anji
Ad

భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. దేశవ్యాప్తంగా ఈరోజు బ్రిటిషు వారి విముక్తి నుంచి పూర్తిగా బయటపడింది. స్వాతంత్య్రం పొందిన స్వేచ్ఛలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజుల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేస్తూ గౌరవవందనం చేస్తాం. స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారత ప్రధాని స్పీచ్ కూడా ఇస్తారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎంలు, గవర్నర్లు, కలెక్టర్లు, పలువురు అధికారులు మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతి ఐక్యతను చాటుతారు.  జెండా పండుగ చేసేటప్పుడు మనం చాలా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలు తెలియక కొందరూ తప్పు చేస్తుంటారు. జెండా ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

  • జాతీయ జెండా ఎగురవేసే సమయంలో ముఖ్యంగా ప్లాస్టిక్ కి సంబంధించిన జెండాను పొరపాటున కూడా ఉపయోగించకూడదు. 
  • చాలా మంది జెండాను రివర్స్ లో ఎగురవేస్తుంటారు. ముఖ్యంగా జెండా ఎగురవేసే సమయంలో పైన కాషాయ రంగు, మధ్యలో తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు కింది స్థానంలో ఉండాలి. 
  • ప్రధానంగా సూర్యదోయ సమయంలో జెండా ఎత్తితే సూర్యాస్తమయం లోపు తప్పనిసరిగా జెండాను దించాలి. 
  • జెండాను నేలపై కానీ నీటిపై కానీ అస్సలు పడవేయరాదు. 

  • జాతీయ జెండాలతో కలిపి ఇతర పార్టీల జెండాలు లేదంటే అవసరమైతే జెండాలు ఎగురవేస్తే తప్పనిసరిగా జాతీయ జెండాను ఆ జెండాల కంటే కొంచెం పై స్థాయిలో ఉంచాలి. 
  • జెండాను ఎప్పుడు కూడా నిటారుగానే ఉంచాలి. కిందికి అస్సలు వంచకూడదు. 
  • పోలీస్ అధికారులు తప్ప ఇతర వ్యక్తులు ఎవరైనా చెప్పులు వేసుకొని జెండాను ఎగురవేయరాదు. జెండా ఎగరేసే సమయంలో ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తలు పాటించండి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

 స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా ఏదో తెలుసా ?

మహేష్ బాబు సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ కమెడీయన్ గా నటించాడనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading