ఇటీవలే పవన్ కళ్యాణ్ క సపోర్ట్ గా రేణు దేశాయ్ ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రేణు దేశాయ్ చేసిన ఆ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. హిందూ మహిళ తన భర్త దుర్మార్గుడైన సపోర్ట్ చేస్తుందని.. అనడానికి రేణు దేశాయ్ వ్యాఖ్యలు ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఆమెకు చురకలు అంటించారు. ఒక మహిళకు అన్యాయం చేసిన వాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని పవన్ పై ఫైర్ అయ్యారు. భర్త చేసిన తప్పులను కూడా కాచి పవన్ కళ్యాణ్ కు రాజకీయం గా అవకాశం ఇవ్వమని అడిగిన రేణు దేశాయ్ నిజమైన భారతీయ మహిళ అంటూ ఎద్దేవా చేశారు.
Advertisement
అటు చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశానన్న టిడిపి నాయకుల మాటలు అబద్ధం అని విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో పూర్తయింది 48 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. చంద్రబాబు చర్చకు వస్తే చర్చించడానికి నేను సిద్ధం…చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చ కు రావాలని సవాల్ చేశారు. పాపాలు చేస్తే ప్రకృతి పగబడుతుంది.. అనేక పాపాలు చేసిన చంద్రబాబుపై ప్రకృతి పగ పట్టిందని ఎద్దేవా చేశారు.
Advertisement
అందుకే చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు, కరువు విలయ తాండవం చేస్తుందని చురకలు అంటించారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే సామెత ఉండేది, కానీ ఇప్పుడు అబద్ధాలు మాట్లాడితే లోకేష్ లాంటి పప్పు పుడతాడు అన్న సామెత ప్రజల్లో ఉందంటూ సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు. పట్టిసీమ దిగువ ప్రాంతంలో 178 కిలోమీటర్ల కాలువలు వైఎస్ ప్రభుత్వం తవ్వింది…. దానికి సంబంధిచిన 12 వేల నాలుగు వందల ఎకరాల భూసేకరణ వైయస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఇందులో చంద్రబాబు చేసిందెంటో ప్రజలకు తెలియాలన్నారు అంబటి రాంబాబు.
ఇవి కూడా చదవండి :
ఫ్యాన్స్ కు షాక్…క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై…?
టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!
Hansika : పబ్ కి తీసుకెళ్లి..బన్నీ బలవంతంగా నాతో ఆ పని చేయించాడు..!