‘మత్తు వదలరా’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి. కాన్సెప్టులు మంచివే సెలెక్ట్ చేసుకుంటున్న ఈ హీరో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న బాగ్ సాలే సినిమాతో థియేటర్లలోకి వచ్చిన శ్రీ సింహ ఇప్పుడు ఉస్తాద్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవాళ ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. వారాహి చలనచిత్రం, కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఫణిదీప్ దర్శకత్వంలో ఉస్తాద్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ మరియు వివరణ :
కథ విషయానికొస్తే సూర్య (శ్రీ సింహ కోడూరి) మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్లే కుర్రాడు. చిన్నప్పుడే తండ్రి మరణంతో… తల్లి (అనూ హాసన్) అన్ని తానై పెంచుతుంది. జీవితంపై దేనిపైనా క్లారిటీ ఉండదు. కోపం వస్తే అప్పటికప్పుడు చూపించే నైజాం ఉన్న వ్యక్తి. ఇతను డిగ్రీ చదువుతున్నప్పుడు పాతకాలం నాటి ఓ బైక్ ను ముచ్చటపడి కొంటారు. దానికి ఉస్తాద్ అని పేరు పెడతాడు. అదే సర్వస్వంగా బతికేస్తుంటాడు. ఆ బైక్ తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ బైక్ వల్లే అతనికి మేఘన (కావ్య కళ్యాణ్ రామ్) సూర్య జీవితంలోకి వస్తుంది. ఓ సందర్భంలో అతను హైలెట్ అవ్వాలనుకుంటాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? ఈ క్రమంలో వాళ్ల ప్రేమ విషయంలో కొన్ని చిక్కులు ఏర్పడతాయి. వాటిని ఎలా సాల్వ్ చేసిన తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది చూడాలి.
Advertisement
ఉస్తాద్ సినిమాలో ఎవరినటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఎవరి పాత్రలో వారు చక్కగా చేశారు. శ్రీ సింహ అయితే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో బాగానే రాటు తేలినట్టుగా అనిపిస్తుంది. కావ్య కళ్యాణ్ కనిపించినంతలో ఓకే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ పాత్ర బాగానే ఉంటుంది. తల్లిగా అనుహాసన్ మంచి పాత్రను పోషించింది. మిగిలిన పాత్రల్లో బైక్ మెకానిక్ క్యారెక్టర్ కాస్త ఎమోషనల్ గా అనిపిస్తుంది. గౌతమ్ మీనన్ హుందాగా కనిపిస్తాడు. ఉస్తాద్ కథలో నటీనటుల కంటే… కథ, కథనాన్ని రాసుకున్న దర్శకుడు పొరబాటే కనిపిస్తుంది. ఆడియన్స్ సినిమాలు చూడాలంటే… తెరపై కనిపించే పాత్రలతో ప్రయాణం చేయాలి.
ప్లస్ పాయింట్స్ :
కథ
స్క్రీన్ ప్లే
శ్రీ సింహ, కావ్య కళ్యాణ్ రామ్
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ అంశాలు లేకపోవడం
స్లో నేరేషన్
క్లైమాక్స్
రేటింగ్ : 2.5/5
ఇవి కూడా చదవండి :
Bholaa Shankar : శ్రీముఖితో చిరంజీవి ఘాటు రొ***న్స్..ముసలోడంటూ కామెంట్స్ !
Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ కు షాక్ తప్పదా ?
సినిమా నాశనం చేశారు.. చిరంజీవిపై శ్రీరెడ్డి సీరియస్ !