Home » మరో రికార్డు  సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఏ విషయంలో అంటే ? 

మరో రికార్డు  సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఏ విషయంలో అంటే ? 

by Anji
Ad

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య 5 టీ20 మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లను వెస్టిండిస్ విజయం సాధించగా.. 3వ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. తన పెర్పార్మెన్స్ చూపించాడు. ఫుల్ ఫామ్ లోకి వచ్చిన ఎస్.కే. వెస్టిండిస్ తో గయానలో జరిగిన టీ20 మ్యాచ్ లో బ్యాండ్ బజాయించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మిస్టర్ 360 ఈ మ్యాచ్ లో మొత్తం 44 బంతులు ఆడి. 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 రన్స్ చేశాడు. సూర్య బ్యాటింగ్ దెబ్బకి టీ20 లో 7 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.

Advertisement

ఇక ఈ మ్యాచ్ తో సూర్యకుమార్ చాలా రికార్డులను తిరగరాశాడు. 100 సిక్సులు పూర్తి చేసిన ఆటగాడిగా.. అత్యంత వేగంగా 100 సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిన సూర్యకుమార్ రికార్డు నెలకొల్పాడు. ఈ అరుదైన ఫీట్ ఆల్రెడీ వెస్టిండీస్ ఆటగాడు ఏవీన్ లుయిస్ పేరిట ఉంది. ఇప్పుడు సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్ కి సంబంధించి సూర్యకుమార్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. గత నవంబర్ నెలలోనే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగుపెట్టి ఒకే ఏడాదిలో 1000 రన్స్ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. క్రికెట్ దాటి మరొక విషయం గురించి మాట్లాడుకుంటే.. గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన వ్యక్తిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్యకుమార్ ఎక్కడ చదువుకున్నాడు. అతని తండ్రి ఎవరు ? సంపాదన ఎంత ? కార్ కలెక్షన్ ఏంటి ? ఎన్ని కోట్లు వచ్చాయి. వంటి ఎస్.కే. వ్యక్తిగత వివరాలన్నింటినీ తెగ వెతికేస్తున్నారట నెటిజన్లు. ఇక వారి ప్రశ్నలకు సమాధానాలు చూసి కూడా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందులో కొన్నింటిని మనం కూడా తెలుసుకుందాం.

Advertisement

  • సూర్యకుమార్ ఆస్తి విలువ రూ.45 నుంచి రూ.55కోట్ల వరకు ఉంటుంది. 
  • బైకు విషయానికొస్తే.. సుజుకి హైబుసా, హార్లే డేవిడ్ సన్, స్పోర్ట్స్ బైకులు కూడా ఉన్నాయి.  
  • కారు కలెక్షన్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ 5 సిరీస్, 530 Dm స్పోర్ట్స్, ఆడీ A6, రేంజ్ రోవర్, హుండాయ్ ఐ20, ఫార్చునర్. 
  • అంతేకాదండోయ్.. ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ ధరకు సూర్యకుమార్ యాదవ్ సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ టీమ్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అంపైర్లను తిట్టిన నికోలస్ పూరన్.. తాట తీసిన ఐసీసీ! భారీ జరిమానాతో పాటు..!

కెనడా క్రికెట్ టోర్నీలో వింత బహుమతి! మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అమెరికాలో భూమి!

Visitors Are Also Reading