సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారు. మొదటిరోజు భోగి తర్వాత రోజు సంక్రాంతి మరుసటి రోజు కనుమ ఇలా ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ పండుగను జరుపుకుంటారు. ఇక మూడో రోజు కనుమకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ రోజు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు గాలిపటాలు ఎగరవేస్తారు. అదేవిధంగా కనుమను పశువుల పండుగ అని అంటారు.
Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన పంటను పండగలా భావించి సంస్కృతిగా ఆచరిస్తారు. పల్లెల్లో ప్రజలకు పశు సంపదనే అసలైన సంపద అని భావిస్తారు. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఆనందం కాబట్టి కనుమ రోజున పశువులను ఎంతో శుభ్రం చేసి అలంకరిస్తారు. పశువుల పట్ల కృతజ్ఞతాభావంతో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా పశువులకు ఇష్టమైన ఆహారాన్ని కనుమ రోజు ఇచ్చి ఆ తరువాత వాటిని ఊరేగిస్తారు.
Advertisement
అదే విధంగా కనుమ రోజున ఇంట్లో మాంసం మరియు ఇతర పిండివంటలు చేసి పెద్దలకి ప్రసాదంగా పెడతారు. అయితే కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయవద్దని చెబుతుంటారు. అదేవిధంగా శుభకార్యాలు కూడా ఈ రోజున చేయరు. దానికి ఒక కారణం కూడా ఉంది. సాధారణంగా కనుమ పండుగ రోజు పిండి వంటలు చేసి పెద్ద పెద్దలకు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.
ఆ రోజున పెద్దలను తలచుకుని కృతజ్ఞతా పూర్వకంగా నడుచుకోవాలి. కాబట్టి అలాంటివి అన్నీ మర్చిపోయి ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. అందుకే కనుమ నాడు ప్రయాణం చేయవద్దని చెబుతుంటారు. పితృదేవతలకు కనుమనాడు ప్రసాదాలు పెట్టి మధ్యాహ్నం భోజనం చేయడం మంచిదని భావిస్తారు.
Also Read: Today rasi phalalu in telugu : భోగి రోజున ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుందట..