Home » Chanakya Niti : నిజమైన స్నేహితుడిని ఇలా గుర్తించండి.. మీరు ఎప్పటికీ మోసపోరు..!

Chanakya Niti : నిజమైన స్నేహితుడిని ఇలా గుర్తించండి.. మీరు ఎప్పటికీ మోసపోరు..!

by Anji
Ad

సాధారణంగా ప్రతీ ఒక్కరి జీవితంలో స్నేహితులు తప్పకుండా ఉంటారు. ఒకరితో మరొకరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది మరి. వారిని సంతోషంగా, ధైర్యంగా, ధీమాగా ఉండేలా చేస్తుంది. జీవితంలో నిజమైన స్నేహితుడు దొరికితే జీవితం మెరుగుపడుతుంది. సదరు వ్యక్తులు ఎప్పటికీ ఒంటరి కాలేడు. నిజమైన స్నేహితుడు కష్ట, సుఖాల్లో ఎల్లవేళలో తోడు, నీడగా ఉంటారు. అలా కాకుండా తప్పుడు వ్యక్తుల సహవాసం చేస్తే.. జీవితం మొత్తం చిన్నాభిన్నమవుతుంది. జీవితం చిధ్రం అవ్వడం ఖాయం. వేలాది మంది చెడు స్నేహితుల కంటే..ఒక్క మంచి స్నేహితుడు జీవితంలోకి వస్తే చాలు.  స్నేహం, స్నేహితుడి గురించి ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంతో వివరించాడు. అసలైన స్నేహితుడు ఎవరు ? మోసం చేసే వారు ఎవరు ? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

chanakya-niti

Advertisement

మన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ వారినే మనం స్నేహితులు అంటాం. కష్ట సమయాల్లో కూడా అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థ్యం కోసం స్నేహ హస్తం చాటాలని.. ఆడంబరంగా చూపించే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది అని చాణక్యుడు సూచించాడు. అలాంటి వారితో స్నేహం చేయడం కంటే.. మీ బాధను మీరే నియంత్రించుకోవడం మిమ్మల్ని మీరే ఓదార్చుకోవడం ఉత్తమం. చాణక్యుడి ప్రకారం.. తియ్యగా మాట్లాడేవారు చాలా ప్రమాదకరం.

Advertisement

chanakya new

ఒక వ్యక్తి యొక్క తప్పులు ఎత్తి చూపేవారు, ఆ తప్పులను సరిదిద్దేవారు నిజమైన స్నేహితులు. చెడు స్నేహితులు ఎప్పుడూ మీ మంచిని కోరరు. మీరు తప్పు చేసినా కరెక్ట్ అని చెబుతారు.  మంచి స్నేహితులను ఉప్పుతో పోల్చారు చాణక్య. ఎందుకంటే స్వీట్లలో పురుగులుంటాయి. కానీ ఉప్పులో పురుగులుండవు.అలాగే మంచి స్నేహితుల్లో కూడా చెడు లక్షణాలు ఉండవని చెప్పారు ఆచార్య. ముఖ్యంగా ఒకరితో స్నేహం చేసే ముందు కొన్ని విషయాలను తప్పుకుండా గుర్తుంచుకోవాలి. అతని ప్రవర్తన, స్వభావం, ఆలోచన విధానాలను పరిగణలోకి తీసుకోవాలి.  ఇతరుల గురించి ఎలాంటి ఆలోచనలున్నాయి. స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించేవిదంగా ప్రవర్తిస్తున్నారా ? లేక మంచిగా ఆలోచిస్తున్నారా అనేది గమనించాలి. ఇతరుల గురించి చెడుగా చెబుతున్నట్టయితే అలాంటి వారు మీ ముందు మంచిగా నటిస్తూనే వెనుక వైపు ఉంటారు. పుట్టుకతో వచ్చే గుణాలు గిట్టేంత వరకు ఉంటాయని పేర్కొంటారు. చెడ్డవారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చాణక్య పేర్కొన్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 CHANAKYA NITI : స్త్రీలో ఈ ఐదు లక్షణాలు ఉంటే భర్త విజయం సాధించినట్టే..!

Chanakya Niti : జీవితంలో ఈ రహస్యాలను ఇతరులతో పంచుకుంటే మీకు అన్నీ అడ్డుంకులే..!

Visitors Are Also Reading